'జడ్జిమెంటల్ హై క్యా' ట్రైలర్‌..!

Published : Jul 03, 2019, 12:20 PM IST
'జడ్జిమెంటల్ హై క్యా' ట్రైలర్‌..!

సారాంశం

కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. 

కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒక మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగే కథ ఇది. ఆ మర్డర్ కంగనా, రాజ్ కుమార్ రావులలో ఎవరో ఒకరు చేశారని పోలీసులు అనుమానిస్తుంటారు. కొద్దిగా మతిస్థిమితం లేని బాబీ అనే పాత్రలో కంగనా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచింది.

రాజ్ కుమార్ రావు.. కేశవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. కథ మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. మొదట ఈ సినిమాకి 'మెంటల్ హై క్యా' అనే టైటిల్ పెట్టారు. కానీ టైటిల్ పట్ల అభ్యంతరాలు రావడంతో 'జడ్జిమెంటల్ హై క్యా' అని పెట్టారు.  

PREV
click me!

Recommended Stories

Divine Blockbusters: తక్కువ బడ్జెట్‌తో బాక్సాఫీసు షేక్‌.. 'హనుమాన్ అంశ్'కి ముందు వందల కోట్లు రాబట్టిన 4 చిత్రాలు
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష