ఇండస్ట్రీలో ఉన్న గ్లామర్, తన ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల ఎన్టీఆర్ చెడిపోయారా.. ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసా 

By tirumala AN  |  First Published Sep 28, 2024, 7:52 AM IST

దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి బోల్డ్ ప్రశ్న ఒకటి ఎదురైంది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన దేవర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి బోల్డ్ ప్రశ్న ఒకటి ఎదురైంది. ఇండస్ట్రీలో ఉన్న గ్లామర్ వల్ల ఎన్టీఆర్ చెడిపోయారా అని ప్రముఖ జర్నలిస్ట్ అడిగారు. ఈ ప్రశ్నకి ఎన్టీఆర్ కూల్ గా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. 

ఎన్టీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ 

Latest Videos

తారక్ కి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఎన్టీఆర్ స్నేహితులు కొందరు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎన్టీఆర్ కి స్నేహితులుగా ఉన్నారు. టీనేజ్ వయసులోనే ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరో అయ్యారు. నటన, డ్యాన్సులు, డైలాగ్స్ విషయంలో తారక్ తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. తారక్ పై అప్పట్లో సమీరా రెడ్డి తో లవ్ ఎఫైర్ సాగుతున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. 

ఇండస్ట్రీలో ఉన్న గ్లామర్, స్నేహితులు మీపై ప్రభావం చూపారా, దానివల్ల మీరు చెడిపోయారా అని జర్నలిస్ట్ అడిగారు. దీనికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ నేను చెడిపోవాలి అని అనుకునే ఎప్పుడో చెడిపోయేవాడిని. నేను చెడిపోకూడదు అని స్ట్రాంగ్ గా ఉంటే చెడిపోను అని తారక్ సమాధానం ఇచ్చారు. వెంటనే జర్నలిస్ట్ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని అడిగారు. నేను చాలా స్ట్రాంగ్.. పాతికేళ్ల వయసుకే ఈ స్థాయికి చేరుకున్నా అని మీరే అంటున్నారు. కాబట్టి నా బలమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది అని తారక్ సమాధానం ఇచ్చారు. 

ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఎన్టీఆర్ చిట్కా 

పర్సనల్ ఎమోషన్స్ ని, కొన్ని ఫీలింగ్స్ ని కొందరు యుక్త వయసులో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోలేరు. ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ మీరు కంట్రోల్ చేసుకున్నారా.. చేసుకుంటే ఎలా సాధ్యం అయింది అని ప్రశ్నించారు. తారక్ బదులిస్తూ.. ప్రతి ఒక్కరికీ ఎమోషన్స్ ఉంటాయి. కానీ లిమిట్ దాటకుండా చూసుకోవాలి. మనకి ఎంత వరకు అవసరం అనేది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. తెలివిగా ఆలోచించాలి అని తారక్ తెలిపారు. 

Also Read: ఫ్లాప్ దర్శకుడివి, నీతో ఎన్టీఆర్ సినిమా చేయడు.. ముఖం మీదే చెప్పిన నిర్మాత, ఏం జరిగిందంటే

జూనియర్ ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారారు. స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి చిత్రాలు తారక్ ని టాలీవుడ్ లో అగ్ర నటుడిగా మార్చేశాయి. సింహాద్రి తర్వాత తారక్ కెరీర్ పరంగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. యమదొంగతో మళ్ళీ పుంజుకుని ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తారక్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. 

దేవర గ్రాండ్ రిలీజ్ 

ఎన్టీఆర్ సత్తా తెలియజేస్తూ వరల్డ్ వైడ్ గా దేవర చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కాగా ఫ్యాన్స్ కటౌట్ లకి పూజలు పాలాభిషేకాలు చేస్తూ హంగామా చేశారు. దేవర జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ మరోసారి నటించిన చిత్రం దేవర. దేవర చిత్రాన్ని భారీ స్థాయిలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రం ఇది. తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ మొదలైంది. అదే విధంగా కొంత నెగిటివ్ టాక్ కూడా ఉందనేది వాస్తవం.

యుఎస్ లో ఆల్రెడీ దేవర చిత్రం 3 మిలియన్ల డాలర్లు వసూలు చేసి రికార్డులు తిరగరాస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో, హిందీ మార్కెట్ లో వసూళ్లు ఎలా ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ తొలిసారి హీరోయిన్ గా నటించింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. 

ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 

ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్, గ్రాండ్ విజువల్స్, ఎన్టీఆర్ నటన, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ సెకండ్ హాఫ్ ఆకట్టుకోలేకపోయింది అంటూ ప్రేక్షకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవర చిత్రానికి పార్ట్ 2 కూడా రానుంది. అయితే పార్ట్ 2 షూటింగ్ ఎంత ఉంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చిత్ర యూనిట్ ప్రకటించాలి. ప్రస్తుతం ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 లో నటిస్తున్నాడు. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం కూడా ప్రారంభం అయింది. ఇంత బిజీ షెడ్యూల్ లో తారక్ దేవర 2 ని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. 

click me!