రాజమౌళి నన్ను చాలా అసహ్యంగా ఉన్నావని అన్నాడు, కొవ్వు ప్రాబ్లెమ్ ఉంది.. జూ.ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Sep 1, 2021, 5:55 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు నటుడిగా ఇటు బుల్లితెరపై హోస్ట్ గా బిజీగా గడుపుతున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు నటుడిగా ఇటు బుల్లితెరపై హోస్ట్ గా బిజీగా గడుపుతున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో సాగే ఈ షో తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా హాజరయ్యాడు. ప్రస్తుతం తదుపరి ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి. 

రీసెంట్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రశ్నల మధ్యలో ఎన్టీఆర్ చక్కటి అంశాలని ప్రస్తావిస్తూ బోర్ ఫీల్ కాకుండా చేస్తాడు. ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ప్రేక్షకుల అలా చూస్తూ ఉండి పోవాల్సిందే. 

తాజాగా ఎన్టీఆర్ తన వ్యక్తి గత విషయం గురించి ధైర్యంగా ప్రస్తావించాడు. తాను గతంలో లావుగా ఉన్నప్పుడు ఎగతాళికి గురయ్యానని అన్నారు. లావుగా ఉన్నానని, అగ్లీగా ఉన్నానని కామెంట్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఒక స్టార్ హీరో తన గురించి ఇలా ధైర్యంగా చెప్పుకోవడం చాలా అరుదు. తాను లావుగా ఉన్నాననే సంగతి ఓ వ్యక్తి చెప్పేవరకు తనకు లైట్ వెలగలేదని ఎన్టీఆర్ తెలిపాడు. 

ఆ వ్యక్తి మరెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి. ఒకరోజు తాను రాజమౌళిని కలవగా నా గురించి మొహమాటం లేకుండా మాట్లాడారు. చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నావు అని అన్నారు. అప్పడే అర్థం అయింది. దీనితో బరువు తగ్గాలని డిసైడ్ అయినట్లు ఎన్టీఆర్ తెలిపాడు. మంగళవారం ఎపిసోడ్ లో మనీష్ అనే కంటెస్టెంట్ తనకు జుట్టు ప్రాబ్లెమ్ ఉందని చెప్పాడు. మీకు జుట్టు ప్రాబ్లెమ్ ఉంది.. నాకు కొవ్వు ప్రాబ్లెమ్ ఉంది అని ఎన్టీఆర్ సరదాగా కామెంట్స్ చేశాడు. 

ఎన్టీఆర్ తాను ఎగతాళికి గురైన అంశాన్ని చెప్పుకోవడంతో తనప అభిమానాన్ని మరింతగా పెంచుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫిట్ అండ్ స్టైలిష్ గా అభిమానులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. యమదొంగ చిత్రం ముందు వరకు ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవాడు. ఆ చిత్రం కోసం ఎన్టీఆర్ లైపోసక్షన్ చెసించుకుని వెయిట్ లాస్ అయిన సంగతి తెలిసిందే. 

అప్పటి నుంచి తన ఫిజిక్ పై ద్రుష్టి పెడుతూ ఫిట్ గా మారాడు. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ ఫాన్స్ చేత విజిల్స్ కొట్టించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయుధ పోరాట యోధుడు కొమరం భీంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. 

click me!