
టాలీవడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తారక్ సినిమా సినిమాకు ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు గాని ఇంతవరకు సొంతంగా ఒక బిజినెస్ ను పెట్టుకోలేదు. ఇక ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా ఉంటున్న తరుణంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ఇటీవల కొంత మంది హీరోల నుంచి కొన్ని ఐడియాలను తీసుకున్నాడట.
లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ బెటర్ అని సినిమా ప్రపంచంలోనే తన బిజినెస్ ఉండాలని మల్టిప్లెక్స్ లను మొదలెట్టడానికి ఈ హీరో సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాస్ ను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అదే తరహాలో తారక్ కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో మల్టిప్లెక్స్ లను నిర్మించడానికి తన టీమ్ ను రెడీ చేస్తున్నాడు.
ముందుగా అమరావతి లేక విశాఖపట్నం వంటి నగరాల్లో బిజినెస్ ను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా గవర్నమెంట్ నుంచి అనుమతి రావాల్సి ఉందట. ఒక్కసారి ఒకే అయితే పనులు మొదలుపెట్టాలని తారక్ రెడీగా ఉన్నట్లు సమాచారం.