తాగేసి హీరోయిన్ రచ్చ.. సాయానికి వచ్చిన సోనమ్ కి అవమానం!

By Udaya DFirst Published Mar 5, 2019, 2:54 PM IST
Highlights

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. 

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ కి పార్టీలకు వెళ్లడం వంటివి చేస్తుండడంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. 

ఇటీవల ఇద్దరూ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారట. ఆ పార్టీకి అర్జున్ కజిన్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా వెళ్లిందట. అక్కడ మలైకా.. సోనమ్ ని అవమానించినట్లు సమాచారం. పార్టీలో ఎంజాయ్ చేస్తూ మలైకా కాస్త ఎక్కువగా మద్యం సేవించిదట. తాగేసి ఆమె చేస్తోన్న రచ్చని అర్జున్ నిలువరించలేదట.

దీంతో సోనమ్.. మలైకా వద్దకు వెళ్లి నేను సాయం చేస్తానని ఆఫర్ చేస్తే దానికి ఆమె.. 'స్టే అవే (దూరంగా వెళ్లు)' అని పొగరుగా చెప్పడంతో సోనమ్ ఒక్కసారిగా షాక్ అయిందట. 

అక్కడున్నవారంతా ఆమెనే చూడడంతో కాస్త అవమానంగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అర్జున్, మలైకాల ప్రేమను సపోర్ట్ చేస్తూ వస్తోన్న సోనమ్ ఈ సంఘటనతో వారికి దూరమయ్యే  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

click me!