మీరా చోప్రాపై ట్రోలింగ్‌ వివాదం.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ట్విటర్‌ అకౌంట్స్‌పై విచారణ

By Satish ReddyFirst Published Jun 9, 2020, 12:24 PM IST
Highlights

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మీరా చోప్రాకు మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి విచారణ మొదలైంది. మొత్తంగా 15 ఎకౌంట్ల నుంచి అభ్యంతరకర కామెంట్లు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ 15 ఎకౌంట్లలో 10 ఎకౌంట్లు ఇప్పటికే డీ ఎక్టివేట్‌ అయినట్టుగా గుర్తించారు

ఒకప్పటి హీరోయిన్‌ మీరా  చోప్రాకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరా చోప్రా మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు తెలియదని చెప్పటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మీరా చోప్రాను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్‌లు శృతి మించటంతో సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది మీరా చోప్రా.

అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆకతాయిల మీద చర్యలు తీసుకోవాలని కోరింది. స్పందించిన కేటీఆర్ తెలంగాణ పోలీసులను విచారణ చేపట్టాల్సింది సూచించారు. తాజాగా ఈ కేసు విషయంలో విచారణ మొదలు పెట్టారు. మొత్తంగా 15 ఎకౌంట్ల నుంచి అభ్యంతరకర కామెంట్లు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే ఈ 15 ఎకౌంట్లలో 10 ఎకౌంట్లు ఇప్పటికే డీ ఎక్టివేట్‌ అయినట్టుగా గుర్తించారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ పేరుతో తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేసి ఇలా అభ్యంతరకర కామెంట్లు చేసినట్టుగా భావిస్తున్నారు పోలీసులు. ఆ 15 ట్విటర్‌ అకౌంట్లకు సంబంధించి వివరాలు అందించాల్సింది ట్విటర్‌కు సైబర్‌ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. అ అకౌంట్లకు సంబంధించిన వివరాలు వచ్చిన తరువాత తదుపరి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

click me!