ఎన్టీఆర్ ‌- ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్వయంగా అనౌన్స్ చేసిన తారక్.

Published : Apr 29, 2025, 02:36 PM IST
ఎన్టీఆర్ ‌- ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్వయంగా అనౌన్స్ చేసిన తారక్.

సారాంశం

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ను  అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. రిలీజ్ డేట్ తో పాటు మరో సాలిడ్ అప్ డేట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్. ఇంతకీ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? 

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్  ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  NTRNEEl వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కర్నాటకలోని ఫేమస్ లోకేషన్స్ ను సెలక్ట్ చేసి.. భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ఇక ఎప్పటికప్పుడు ఈసినిమాకు సబంధించన అప్ డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు ప్రశాంత్ టీమ్. 

ఇక తాజాగా ఈసినిమాకు సబంధించి సాలిడ్ అప్ డేట్ వచ్చింది. నందమూరి ప్యాన్స్ కు అదిరిపోయే  ట్రీట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటు మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ను కూడా అందిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే అనూహ్యంగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. గతంలో ఇచ్చిన డేట్ కాకుండా కొత్త రిలీజ్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. గతంలో ఈసినిమాను వచ్చ ఏడాది  సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూశారు మేకర్స్.ఇక ఇప్పుడు ఆ డేట్ ను జూన్ కు షిప్ట్ చేశారు. 2026 జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను  గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

 

 

అంతే కాదు ఈసినిమాకు సబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా  మే 20న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు.  తారక్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ సాలిడ్ ట్రీట్ అందించబోతున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. .  ఇక ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈసినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు