జానీ డెప్‌ కేసులో కోర్ట్ సంచలన తీర్పు.. `కరీబియన్‌` నటుడి భావోద్వేగం.. మాజీ భార్య కన్నీళ్లు

Published : Jun 02, 2022, 11:49 AM IST
జానీ డెప్‌ కేసులో కోర్ట్ సంచలన తీర్పు.. `కరీబియన్‌` నటుడి భావోద్వేగం.. మాజీ భార్య కన్నీళ్లు

సారాంశం

హాలీవుడ్‌ నటుడు, `పైరేట్స్ ఆఫ్‌ ది కరీబియన్‌` చిత్రాల ఫేమ్‌ జానీ డెప్‌కి, ఆయన మాజీ భార్య అంబర్‌ హార్డ్ మధ్య పరువు నష్టం కేసులో కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది.

`పైరేట్స్ ఆఫ్‌ ది కరేబియన్‌` ఫేమ్‌ జానీ డెప్‌ కేసులో కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. తన మాజీ భార్య, హాలీవుడ్‌ అంబర్‌ హార్డ్ పెట్టిన కేసులో తనకు అనుకూలంగా కోర్ట్ తీర్పునిచ్చింది. ఇద్దరు పరువు నష్టం దావా వేసుకోగా ఈ కేసులో ఇద్దరు పరువు నష్టం పొందేందుకు అర్హులే అంటూ వెల్లడించింది వర్జీనీయాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ కోర్ట్. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో కోర్ట్ ఆవరణ మొత్తం షాక్‌కి గురయ్యింది. 

జానీ డెప్‌ పేరును ప్రస్తావించకుండానే మ్యారేజ్‌ లైఫ్‌లోని హింస గురించి ప్రస్తావిస్తూ 2018లో ఆయన మాజీ భార్య అంబర్‌ హార్డ్ `ది వాషింగ్టన్‌ పోస్టు`లో ఒక కథనం రాసింది. ఆ కథనం తనని ఉద్దేశించిందే అని, తన పరువు దెబ్బతీసేలా ఆ కథనం ఉందని ఆరోపిస్తూ జానీ డెప్‌ 2019 ఫిబ్రవరిలో 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు జానీ డెప్.  అంతేకాదు ఆమె తనకు నరకం చూపించేదని, అవమానించేదని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో(ఎలన్‌ మస్క్‌)తో ఎఫైర్‌ నడిపించిందని, అదే ఆమెను ప్రభావితం చేసిందని దావాలో ఆరోపించాడు.

దీంతో ఆయన మాజీ భార అంబర్‌ హార్డ్ కూడా తిరిగి పరువు నష్టం దావా వేసింది. తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్‌, ఆయన లాయర్‌ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 2020 ఆగష్టులో 100 మిలియన్‌ డాలర్లకు కౌంటర్‌ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం(జూన్‌ 1) తీర్పు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పుని వెల్లడించింది. ఆయనకు మాజీ భార్య 15 మిలియన్‌ డాలర్లు పరువు నష్టం చెల్లించాలని వెల్లడించింది. 

అదే సమయంలో అంబర్‌ హర్డ్ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్‌ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్‌కు ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్‌ కోర్టు.2018లో ఆమె రాసిన సెక్సువల్‌ వయొలెన్స్‌ ఆర్టికల్‌ ఒకటి, జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. 

కోర్టు తీర్పు అనంతరం జానీ డెప్‌ మాజీ భార్య అంబర్‌ బోరున విలపించింది. తన గుండె బద్ధలైందని, నిరాశ చెందానని, ఈ తీర్పు తనకే కాదని మహిళలందరికీ దెబ్బ అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తనకున్న పరిపతి కారణంగానే జానీ డెప్‌ ఈ కేసులో గెలిచాడని ఆరోపించింది. మరోవైపు కోర్పుతో జానీ డెప్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ(న్యాయమూర్తులు) సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడాయన. 

జానీ డెప్‌, అంబర్‌హర్డ్‌ల వివాహం 2015లో జరిగింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థాల కారణంగా ఏడాదికే విడిపోయారు.2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు అతి జుగుప్సాకరంగా ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కారు. వీరి ఆరోపణలు వారి కెరీర్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపడం గమనార్హం. ఇక హాలీవుడ్‌లో `పైరేట్స్ ఆఫ్‌ ది కరీబియన్‌` చిత్రాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. ఈ సినిమాలో స్టార్‌గా ఎదిగారు జానీ డెప్‌. ప్రస్తుతం ఆయన `జీన్నె దు బేర్రీ` చిత్రంలో నటిస్తున్నారు. `ఆక్వామెన్‌`, `నెవర్‌ బ్యాక్‌ డౌన్‌`, `డ్రైవ్‌ యాంగ్రీ` వంటి చిత్రాలతో నటిగా పాపులర్‌ అయిన అంబర్‌ హార్డ్ ప్రస్తుతం `ఆక్వామెన్‌` సీక్వెల్‌లో నటిస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ