శ్రీదేవి కూతురు జాహ్నవి రూపంలో అందాల తుఫాన్ వస్తోందిలా..

Published : Feb 03, 2018, 09:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
శ్రీదేవి కూతురు జాహ్నవి రూపంలో అందాల తుఫాన్ వస్తోందిలా..

సారాంశం

అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి తెరంగేట్రం జాహ్నవిని వెండితెరకు పరిచయం చేస్తున్న కరణ్ జోహార్ అందంతో తల్లి శ్రీదేవిలానే ఆకట్టుకుంటున్న జాహ్నవి

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని జలై20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

 

శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అగ్రకులానికి చెందిన అమ్మాయి, తక్కువ జాతికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతామని కరణ్ జోహార్ అన్నారు. జీ స్టూడియోస్, ధర్మా మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

 

 ‘ధడక్' మూవీ జులై 6, 2018లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాహ్నవి తొలి సినిమా విషయంలో రిస్క్ చేయకుండా ఆల్రెడీ హిట్టయిన సినిమానే ఎంచుకున్నారు. మరి జాహ్నవి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండబోతోందో చూడాలి. శ్రీదేవిలా అందంతోపాటు అభినయంతో ఆకట్టుకుంటుందా.. అనేది చూడాలంటే జూన్ దాకా వెయిట్ చేయాలి.

PREV
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ