Jessi Eliminated: బిగ్‌బాస్‌ 5హౌజ్‌లో పెద్ద ట్విస్ట్ .. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే.. వాళ్లంతా రిలాక్స్..

By Aithagoni Raju  |  First Published Nov 14, 2021, 12:02 PM IST

పదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌లో సన్నీ, సిరి, కాజల్‌, మానస్‌, రవి ఉన్నారు. అయితే శనివారం నాగార్జున.. సన్నీని సేవ్‌ చేశాడు. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో సిరి, కాజల్‌, మానస్‌, రవి ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేషన్‌ అవ్వడం ఖాయం.


బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) వ సీజన్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. పదో వారం కెప్టెన్సీ టాస్క్ హీట్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది. నాగార్జున(Nagarjuna) సమక్షంలోనూ శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మరోసారి సన్నీ, రవి మధ్య వాగ్వాదం, సిరి- సన్నీ మధ్య, షణ్ముఖ్‌-సన్నీ మధ్య వాగ్వాదం ఆద్యంతం రక్తికట్టించేలా సాగింది. సన్నీని దోషిగా తేల్చిన నేపథ్యంలో అతను చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడంపై సోషల్‌ మీడియా విమర్శలు వస్తున్నాయి. నాగార్జున సైతం షణ్ముఖ్‌, సిరిలకు సపోర్ట్ చేయడంపై కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. 

పదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌లో సన్నీ, సిరి, కాజల్‌, మానస్‌, రవి ఉన్నారు. అయితే శనివారం నాగార్జున.. సన్నీని సేవ్‌ చేశాడు. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో సిరి, కాజల్‌, మానస్‌, రవి ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేషన్‌ అవ్వడం ఖాయం. అయితే అది ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ వారం ఎలిమినేషన్‌ ఉండబోదని తెలుస్తుంది.  మరి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది మరింత సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. 

Latest Videos

పదో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేది జెస్సీనే అని తెలుస్తుంది. జెస్సీ (Jessi) ఆరోగ్యం బాగా లేదు. గత కొన్ని వారాలుగా Jessi అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాలి నొప్పితోపాటు కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ఇంకా పూర్తి స్థాయిలో మెడికల్‌ ఎగ్జామింగ్‌ చేయాలని వైద్యులు సూచించారు. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాలని, ఆ తర్వాత జెస్సీ హౌజ్‌లోకి పంపించాలనేది నిర్ణయం తీసుకుంటామన చెప్పాడు నాగార్జున. ఈ నేపథ్యంలో ఇప్పుడు షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఈ వారం హౌజ్‌నుంచి జెస్సీనే బయటకు(Jessi Eliminated) వెళ్లిపోతున్నాడట. 

తన అనారోగ్యానికి సంబంధించి మరింతగా పరీక్షలు చేయడం, ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి అవసరం ఉందని వైద్యులు తెలియజేయడంతో జెస్సీ ఇక తాను హౌజ్‌ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడట. దీంతో జెస్సీ పదో వారం ఎలిమినేట్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన కోరిక మేరకు ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఎవరినీ ఎలిమినేట్‌ చేయోద్దని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పదో వారం జెస్సీనే ఎలిమినేట్‌ కాబోతున్నట్టు వార్త వైరల్‌ అవుతుంది. 

also read: Bigg Boss Telugu 5: సన్నీని దోషిగా తేల్చిన సభ్యులు.. కానీ సన్నీ ధైర్యాన్ని ప్రశంసించిన నాగ్‌.. ఇదేం ట్విస్ట్

ఇప్పటి వరకు తొమ్మిది వారాల్లో విశ్వ, లోబో, ప్రియా, నటరాజ్‌, లహరి, హమీద, స్వేత వర్మ, ఉమాదేవి, సరయు ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇంకా ఐదు వారాలు ఈ షో రన్‌ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా ప్రసారమవుతున్న ఈ ఐదో సీజన్‌ మరింత ఆసక్తికరంగా సాగుతుండటం విశేషం. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ , రవి, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, మానస్‌, సిరి, అనీ మాస్టర్, ప్రియాంక, కాజల్‌ ఉన్నారు. 

also read: నాగార్జున వరస్ట్ హోస్ట్.. సన్నీని దోషిగా తేల్చడంపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌.. సన్నీ, షన్ను ఫ్యాన్స్ ఢీ

click me!