ఒక్క సినిమా చేయని ఇమాన్విలో ప్రభాస్ డైరెక్టర్ కి నచ్చిన క్వాలిటీ అదే.. ఆఫర్ ఎందుకు ఇచ్చాడో ఓపెన్ గా చెప్పేశాడు

ఒక్క సినిమా చేయని సోషల్ మీడియా సెలబ్రిటీకి ప్రభాస్ పక్కన ఛాన్స్ ఎలా వచ్చింది ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇమాన్వి ని ఎంపిక చేయడం వెనుక కారణం ఓపెన్ గా చెప్పేశాడు దర్శకుడు. 
 


ప్రభాస్ తో నటించడానికి స్టార్ హీరోయిన్స్ సైతం క్యూ కడతారు. ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్. ఆయన సినిమాల బడ్జెట్ రూ. 500 కోట్లకు పైమాటే. ప్రభాస్ సినిమాలు పలు భాషల్లో విడుదలవుతాయి. కాబట్టి ప్రభాస్ తో నటించిన హీరోయిన్ కి విపరీతమైన రీచ్ దక్కుతుంది. అలాంటి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఓ సోషల్ మీడియా సెలబ్రిటీ ఎంపికైంది అంటే నమ్మడం కష్టమే. ఇది నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు. 

ఇమాన్వి పేరు ఇండియా వైడ్ వినిపిస్తుంది. అసలు ఎవరీ ఇమాన్వి అని జనాలు సెర్చ్ చేస్తున్నారు. అందుకు కారణం... ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇమాన్వి నటించడమే. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి ప్రభాస్ తో పీరియాడిక్ వార్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ఫౌజి వర్కింగ్ టైటిల్. రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి ప్రేమకథగా ఫౌజి తెరకెక్కించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

Latest Videos

ఇటీవల ఫౌజి పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రభాస్ పక్కన ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా దర్శకుడు హను రాఘవపూడి ఇమాన్విని ఫౌజి మూవీ హీరోయిన్ గా ఎంపిక చేయడం వెనకున్న కారణం తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో కొత్త టాలెంట్ ని వెలికి తీయడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తమ చిత్రాల్లో పాత్రలకు సరిపడే నటులను ఎంచుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. 

ఇమాన్వి అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి. అందరిలాగే నేను కూడా ఆమె డాన్స్ వీడియోలు చూస్తాను. ఆమె ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్. కళ్ళతో ఎన్నో హావ భావాలు పలికించగలదు. అందుకే హీరోయిన్ గా ఎంపిక చేశాను'' అన్నారు. ఫౌజి పీరియాడిక్ మూవీ కాగా.. హీరోయిన్ పాత్ర క్లాసికల్ డాన్సర్ కావచ్చు. అందుకే హను రాఘవపూడి ఇమాన్విని హీరోయిన్ గా ఎంచుకున్నాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. 

ఇమాన్వి వివరాలు పరిశీలిస్తే... ఈమె లాస్ ఏంజెల్స్ నుండి ఇండియా వచ్చింది. పుట్టింది మాత్రం ఇండియాలోనే. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటుంది. ఆమె కుటుంబం కాలిఫోర్నియాలో ఉంటున్నట్లు సమాచారం. ఇంస్టాగ్రామ్ లో ఇమాన్వి డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంది. 8 లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇమాన్వి యూట్యూబ్ ఛానల్ ని 1.8 మిలియన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తాల్ మూవీలోని 'రమ్తా జోగీ' సాంగ్ కి ఆమె చేసిన కొరియోగ్రఫీ వైరల్ అయ్యింది... 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@imanvi1013)

click me!