అవును.. 'మా'లో డబ్బు ఖర్చు చేశాం.. జీవిత కామెంట్స్!

By Udaya DFirst Published 16, Apr 2019, 4:35 PM IST
Highlights

'మా' అసోసియేషన్ లో డబ్బుని ప్రభుత్వ ప్రకటనలు చేయడానికి ఉపయోగించారని ఈరోజు వార్తలు వచ్చాయి.

'మా' అసోసియేషన్ లో డబ్బుని ప్రభుత్వ ప్రకటనలు చేయడానికి ఉపయోగించారని ఈరోజు వార్తలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ లో డబ్బు సభ్యుల కోసం వినియోగించకుండా ప్రభుత్వ యాడ్లు చేయడమేంటని వివాదం మొదలైంది.

దీనిపై క్లారిటీ ఇచ్చిన సంఘ కార్యదర్శి జీవిత 'మా'లో డబ్బు ఖర్చు చేసిన మాట వాస్తవమేనని.. నిబంధనల ప్రకారమే అలా చేసినట్లు వెల్లడించారు. కార్యవర్గంలో అందరికీ ఈ విషయం తెలుసునని అన్నారు. ఇంకెవరికైనా.. సందేహాలు ఉంటే ఆఫీస్ కి వస్తే వివరణ ఇస్తామని అన్నారు.

ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు ఉంటే మా సంఘంలో వారికి కూడా అందేలా చేస్తామని హామీ ఇచ్చిందని, కారణంగానే తమ వంతుగా ఆ మంచి పథకాలను ప్రచారం చేయాలని నిర్ణయించామని చెప్పారు. చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందించామని చెప్పారు.

ఆ సమయంలో 'మా' అధ్యక్షుడు నరేష్ మరొక చోట ఉండడంతో.. డబ్బు తను అడ్జస్ట్ చేసినట్లు జీవిత వివరించారు. అందువల్లనే మళ్లీ ఆ మొత్తాన్ని 'మా' నుండి తీసుకున్నామని చెప్పారు.

ఇంత తక్కువ మొత్తానికి ఎవరూ ప్రకటనలు చేయించలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి సహాయం పొందాలనుకున్నప్పుడు తమవంతు కృతజ్ఞతతో చేశామే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పారు.  

'మా' అసోసియేషన్ డబ్బు.. హీరో కూతురు ఖాతాలోకి..?

Last Updated 16, Apr 2019, 4:39 PM IST