జయసుధ కుమారుడి పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే!

Published : Sep 12, 2019, 08:43 PM IST
జయసుధ కుమారుడి పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే!

సారాంశం

సహజ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు జయసుధ. ఆమె ఇప్పటికి టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నటిగా మాత్రమే కాక జయసుధ రాజకీయాలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జయసుధ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. 

సీనియర్ నటి జయసుధ ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎందరో అగ్ర నటులతో నటించిన అనుభవం ఆమె సొంతం. జయసుధ సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా నటించారు. 1985లో ఆమె హిందీ నటుడు జితేంద్ర బంధువు అయిన నితిన్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. నితిన్ కపూర్ 2017లో మరణించారు. 

జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజా సమాచారం మేరకు జయసుధ నివాసంలో త్వరలో శుభకార్యం జరగబోతున్నట్లు తెలుస్తోంది. జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహం నిశ్చయమైందట. ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత కౌర్ తో నిహార్ వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి పెళ్ళికి ముహూర్తం కుదిరింది. నిహార్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు. గతంలో జయసుధ కాంగ్రెస్ నాయకురాలిగా పనిచేశారు. ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జయసుధ, నిహార్ ఇద్దరూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన