గొడవలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి కోసం వచ్చిన జయప్రద

Published : Feb 28, 2018, 05:02 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
గొడవలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి కోసం వచ్చిన జయప్రద

సారాంశం

శ్రీదేవి సినీ రంగంలో మూడు తరాల నటీనటులతో పని చేసిన ఆమె అందరితోనూ కలివిడిగానే ఉండేది. కానీ జయప్రదతో మాత్రం ఆమెకు పడేది కాదు. ​ ఐతే ఇప్పుడు శ్రీదేవి హఠాన్మరణంతో జయప్రద కదిలిపోయారు.​

శ్రీదేవి సినీ రంగంలో మూడు తరాల నటీనటులు.. టెక్నీషియన్లతో పని చేసిన ఆమె చాలా వరకు అందరితోనూ కలివిడిగానే ఉండేది. కానీ ఒక్క జయప్రదతో మాత్రం ఆమెకు పడేది కాదు. వీళ్ల మధ్య ఎందుకు గొడవ వచ్చిందో కానీ.. అది రాను రాను ఎక్కువైంది. చాలా ఏళ్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఉండిపోయారు. చివరికి ఓ హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా కలిసిన వీళ్లిద్దరినీ ఒక గదిలో తాళం పెట్టి వెళ్లిపోయారట. అలా అయినా మాట్లాడుకుంటారేమో అని అనుకుంటే అదేమీ జరగలేదు. గంట తర్వాత చూస్తే ఇద్దరూ దూరంగానే ఉన్నారు.  వీళ్లిద్దరి మధ్య అంతటి విభేదాలుండేవి

ఐతే ఇప్పుడు శ్రీదేవి హఠాన్మరణంతో జయప్రద కదిలిపోయారు. గత విభేదాలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి గురించి గొప్పగా మాట్లాడారు. తమ మధ్య ఒకప్పుడు గొప్ప స్నేహం ఉండేదన్నారు. శ్రీదేవి లేదన్న నిజాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని.. ఎన్ని రోజులకు జీర్ణించుకుంటానో కూడా తెలియదని జయప్రద అన్నారు. జాన్వి తెరంగేట్రం కోసం శ్రీదేవి ఎంతో తపించేదని.. కానీ అది చూడకుండానే ఆమె వెళ్లిపోయిందని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే ముంబయిలో వాళ్లింటికి వెళ్లిన జయప్రద.. నిన్న రాత్రి శ్రీదేవి పార్థివ దేహం చూడడానికి ఉదయం అక్కడికి చేరుకుంది. 

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?