'శశిలలిత' బయోపిక్ కి రంగం సిద్ధం! (వీడియో)

Published : Apr 09, 2019, 04:39 PM ISTUpdated : Apr 09, 2019, 04:43 PM IST
'శశిలలిత' బయోపిక్ కి రంగం సిద్ధం! (వీడియో)

సారాంశం

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో జయలలిత జీవితం ఆధారంగా రెండు బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ''గతంలో ఎన్నో చిత్రాలను నిర్మించాను. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా తీస్తున్నాను. ఇప్పుడు జయ లలిత బయోపిక్ కూడా తీయాలని అనుకుంటున్నాను. అన్ని రకాల కోణాల్లో ఈ సినిమాను తీయాలనుకుంటున్నాను.  దీనికి 'శశిలలిత' అనే టైటిల్ ఫిక్స్ చేశాను'' అంటూ చెప్పుకొచ్చాడు. 

అన్ని భాషల్లో ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో జయలలిత జీవితానికి సంబంధించి సరికొత్త కోణం చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. ఆమె గురించి తెలియని చాలా విషయాలు ఇందులో చూపించనున్నానని స్పష్టం చేశారు.

ఆమె బాల్యం, హీరోయిన్ గా ఎదుగుదల, లవ్ ఎఫైర్, శోభన్ బాబుతో ఆమె ప్రేమాయణం, ఆసుపత్రిలో చివరి రోజుల్లో ఆమె ఎలా గడిపారనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారు.  ఈ సినిమా కుంగిపోతున్న రాజకీయ వ్యవస్థకి ఎలిగెత్తి చాటే ఉత్తమ చిత్రమవుతుందని అన్నారు. 

"

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం