జయ బయోపిక్ కోసం 100కోట్ల బడ్జెట్.. ఎందుకంటే?

Published : Jun 04, 2019, 12:28 PM IST
జయ బయోపిక్ కోసం 100కోట్ల బడ్జెట్.. ఎందుకంటే?

సారాంశం

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఎలాంటి సినిమా చేసిన మినిమమ్ 70కోట్ల బిజినెస్ జరగడం కామన్. సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతోన్న ఈ బ్యూటీ నెక్ట్ 100కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న తలైవి చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. 

జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ లో కంగనా జయ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. జయ సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో కాంట్రవర్సీ విషయాలు ఉన్నాయి. ఈ సినిమాపై సౌత్ జనాలతో పాటు బాలీవుడ్ జనాలు కూడా బారి అంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే సినిమా బడ్జెట్ ని ఇటీవల ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

100కోట్లకు ఏ మాత్ర తగ్గకుండా అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ లో కంగనాకు ఎలాగూ మంచి మార్కెట్ ఉంది. ఇక కోలీవుడ్ లో జయలలిత క్రేజ్ ఉపయోగపడుతుంది. 100కోట్లు వెనక్కి తేవడం ఈ బయోపిక్ కి పెద్ద కష్టమేమి కాదు కాబట్టి ఈ స్థాయి బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.

బాహుబలి రచయిత కె.విజయేంద్రప్రసాద్ జయ బయోపిక్ కి సంబందించిన కథను రాయగా సినిమాకు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించబోతున్నాడు.

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది