
బేబీ మూవీతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు. హీరోయిన్ గా వైష్ణవి నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేసింది. మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వైష్ణవి పేరు మారుమ్రోగుతుంది. చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఇదిలా ఉంటే వైష్ణవి తమ్ముడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.
బేబీ మూవీ సక్సెస్ నేపథ్యంలో వైష్ణవి చైతన్య హీరో విజయ్ దేవరకొండను ఆయన నివాసంలో కలిశారు. ఆమెతో పాటు తమ్ముడు కూడా వచ్చాడు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలతో వైష్ణవి చైతన్య, ఆమె తమ్ముడు ఫోటోలు దిగారు. సదరు ఫొటోల్లో వైష్ణవి చైతన్య పోజులు కొంచెం ఓవర్ గా ఉన్నాయనేది నెటిజెన్స్ అభిప్రాయం. అసలు ఎవరో కూడా తెలియని వైష్ణవి తమ్ముడు విజయ్ దేవరకొండ మీద చేయి ఫోటోలు దిగడం చర్చకు దారితీసింది.
అతడేదో పెద్ద స్టార్ మాదిరి విజయ్ దేవరకొండ పక్కన ప్రవర్తించాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... వీడేంటి విజయ్ దేవరకొండలా ఫీల్ అవుతున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? బాబు నువ్వు స్టార్ హీరో అనుకుంటున్నావా? అని కామెంట్స్ పెడుతున్నారు. ఫోటోల్లో అలాంటి పోజులిచ్చిన వైష్ణవి తమ్ముడు ఆలోచన ఏంటో తెలియదు కానీ... నెటిజెన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. అనుకోకుండా వైష్ణవి తమ్ముడు బలయ్యాడు. కాగా బ్రో విడుదలతో బేబీ మూవీ జోరు తగ్గింది. అయితే బ్రో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ఈ క్రమంలో బేబీకి మరలా థియేటర్స్ పెరిగే సూచనలు కలవు.