మూడు ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాః `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి

Published : Jul 03, 2021, 01:54 PM IST
మూడు ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాః `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి

సారాంశం

`జాతిరత్నాలు` సినిమా తర్వాత అఫీషియల్‌గా ఆయన ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు. ఆయన సినిమాలపై అనేక వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన నెక్ట్స్ సినిమాల గురించి వెల్లడించారు.

`ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` చిత్రాలతో సక్సెస్‌ సాధించి క్రేజీ కమెడీ హీరోగా మారాడు నవీన్‌ పొలిశెట్టి. తనకంటూ ఓ స్పెషల్‌ జోనర్‌ ని ఏర్పాటు చేసుకున్నారు. సింపుల్‌ కథతో ఫన్‌ జనరేట్‌ చేసి రెండున్నర గంటలు థియేటర్లో నవ్వులు పూయించి సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. ఇటీవల విడుదలైన `జాతిరత్నాలు` సినిమా దాదాపు యాభై కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే నవీన్‌ కామెడీకి ఏ రేంజ్‌లో మార్కెట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ సినిమా తర్వాత అఫీషియల్‌గా ఆయన ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు. ఆయన సినిమాలపై అనేక వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన నెక్ట్స్ సినిమాల గురించి వెల్లడించారు. తాను ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించబోతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఆయా సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఇంకా ఏ వార్తలను నమ్మొద్దంటూ ఓ ఇంగ్లీష్‌ రైటర్‌ కోటేషన్‌ని పంచుకున్నాడు నవీన్‌. మూడు సినిమాలు మూడు బిగ్గెస్ట్ బ్యానర్స్ లో చేస్తున్నాడట. వాటిలో పనిచేయడం తన డ్రీమ్‌ లాంటిదని పేర్కొన్నాడు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పాడు. 

కానీ ఆ మూడు సినిమా వివరాలు చెప్పలేదు. అయితే వీటిలో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో అనుష్క శర్మతో జోడీ కట్టబోతున్నాడట నవీన్‌ పొలిశెట్టి. అంతేకాదు ఇందులో విజయ్‌ దేవరకొండ ఎక్స్‌టెండెడ్‌ కోమియో చేస్తున్నట్టు సమాచారం. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?