రెయిన్ సాంగ్‌లో యంగ్ హీరోతో జాన్వి కపూర్ హీట్ డ్యాన్స్, వీడియో చూసేయండి

Published : Aug 09, 2025, 09:05 AM ISTUpdated : Aug 09, 2025, 06:49 PM IST
Jahnvi kapoor dance

సారాంశం

జాన్వి కపూర్ తల్లి వారసత్వాన్ని నిలబెట్టేసింది. ఆమె అందంలోనే కాదు.. నటనలో కూడా తల్లికి సాటి లేదని నిరూపిస్తోంది. తాజాగా ‘భిగి సారీ’ అంటూ సిద్ధార్థ మల్హోత్రాతో జాన్వీ రొమాంటిక్ సాంగ్ చూస్తే ఎవరైనా ఆ విషయం ఒప్పుకోవాల్సిందే.

జాన్వి కపూర్ హీరోయిన్‌గా సిద్ధార్థ మల్హోత్రా హీరోగా ‘పరమ్ సుందరి’ అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో జాన్వి ఎంత అందంగా కనిపిస్తుందో ప్రచార చిత్రాల్లోనే తెలుస్తోంది. పోస్టర్స్ లో జాన్వి అందానికి ఆమె అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఇందులో సిద్ధార్థ మల్హోత్రాతో జాన్వి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సినిమాలోని భిగి సారీ అనే పాట వీడియోను విడుదల చేశారు. ఇందులో జాన్వి కపూర్ రొమాన్స్ వేరే లెవెల్‌లో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్‌గా మారింది.

జాన్వీ రెయిన్ డ్యాన్స్

భిగి సారీ అనే పాట వర్షంలో హీరో హీరోయిన్ చేసే సాంగ్. ఇందులో జాన్వి కపూర్, సిద్ధార్థ మల్హోత్రా వర్షంలో తడుస్తూ హీట్ పెంచేలా నటించారు. ఈ రెయిన్ సాంగ్ కు మామూలుగా రెస్పాన్స్ రాలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అయింది. సినిమా సైతం ఈ పాట వల్లే హిట్ అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట.. సినిమా బిజినెస్ కూడా ఖచ్చితంగా ఎక్కువే అవుతుందని ఆ సినిమా దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. శ్రీదేవి కూడా గతంలో ఎన్నో రెయిన్ డాన్సులు చేసింది. ఇప్పుడు జాహ్నవి కపూర్ కూడా తల్లి బాటలోనే సాగుతోంది. పరమ సుందరిలో ఆమె చేసిన ఈ రెయిన్ డాన్స్ కు ఎవరైనా అలా కళ్లప్పగించి చూడాల్సిందే.

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది

పరమ్ సుందరి సినిమాను తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ మల్హోత్రా, జాన్వి మొదటిసారి కలిసి నటించారు. ఈ కాంబినేషన్ పై కూడా అందరికీ ఎంతో ఆసక్తి ఉంది. ఇద్దరూ యంగ్ హీరో హీరోయిన్లు కావడంతో వారిద్ర మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. వీరిద్దరి జోడికి ఇప్పటికే మంచి పేరు వచ్చేసింది. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మరొక రెండు మూడు సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక ఈ సినిమా విడుదల విషయానికి వస్తే ఈ నెల 29వ తారీఖున విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, ట్రైలర్లు అన్నింటినీ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగులో కూడా

ఈ సినిమాలో షూటింగ్ స్పాట్‌లు కూడా అదిరిపోతాయని చెబుతున్నారు. ఎందుకంటే కేరళలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళ్, మలయాళంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. జాన్వీ కపూర్ కి తెలుగులో కూడా ఇప్పటికే క్రేజీ ఏర్పడింది. జాన్వీ తల్లి శ్రీదేవి తెలుగులో పెద్ద హీరోయిన్ కావడం అందులోనూ జాన్వి ప్రస్తుతం రామ్ చరణ్ పక్కన నటిస్తుండడంతో పరమ్ సుందరి తెలుగులో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

జాన్వి 2018లో హిందీ సినిమా ధడక్ తో తెరంగేట్రం చేసింది. ఎన్టీఆర్ పక్కన దేవర సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలోని చుట్టమల్లే పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2018 నుంచి ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంది.

https://youtu.be/Aa2ZpTBmzlw?si=gMTPAknDgFID94c6

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్