
తెలుగువారికి ఈటీవీని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీ పుట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ వారు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు. ఆ వేడుకకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ వేడుకలో చిరంజీవి, కుష్బూ, కీర్తి సురేష్, రాఘవేంద్రరావు, మురళీమోహన్, ఆలీ, బ్రహ్మానందం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తారలు హాజరయ్యారు. ఈటీవీ 30 వసంతాల వేడుక లో రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులైన రామోజీరావును తలుచుకున్నారు అతిథులు. అలాగే ప్రోమోలో రామోజీరావును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అతడు మాట్లాడుతున్నట్టు వీడియోను విడుదల చేశారు. మీరు ఈ ప్రోమో పై ఒక లుక్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
ఇక ప్రోమోలో చిరంజీవి కుష్బూ కాసేపు వేదికపై ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్నారు. అలాగే ఎంతోమంది ప్రముఖ గాయనీ గాయకులను తీసుకొచ్చి అందమైన పాటలను పాటించారు. బ్రహ్మానందం కామెడీ అదిరిపోయింది. సుమ యాంకరింగ్ చేసిన ఈ వేడుకలో సుమా - బ్రహ్మానందం మధ్య ఎన్నో జోకులు పేలాయి. సుమా మాట్లాడుతూ ‘30 సంవత్సరాల వెనక్కి వెళితే...’ అనగానే బ్రహ్మానందం ‘ఎందుకు వెళ్లాలి.. పనీ పాటా లేదా..’ అని ప్రశ్నించారు. దానికి అందరూ నవ్వారు.
కీర్తి సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. రామోజీరావు కుటుంబమంతా ఈ కార్యక్రమంలో కనిపించింది. రామోజీ కుమారుడు కిరణ్, కోడలు, మనవళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫరియా అబ్దుల్లా అలాగే మరి కొంతమంది ప్రముఖ డాన్సర్లు అనేక పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. సింగర్ సునీత, కల్పన, ఆర్పీ పట్నాయక్ వంటి వారు అందమైన పాటలను పాడి వినిపించారు. వేదికపై ఎంతో మందికి అవార్డులను కూడా అందించారు. చివరిగా చిరంజీవి కేకును కట్ చేశారు. ఈ వేడుకలో రాఘవేందర్రావుకు ప్రత్యేకంగా సన్మానం చేశారు. మల్లెమాల శ్యాంప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
https://www.youtube.com/watch?v=WBPDi9gNeyA