అఫీషియల్.. NTR30 హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫైనల్.. తారక్ తోనే టాలీవుడ్ కు ఎంట్రీ.!

By Asianet News  |  First Published Mar 6, 2023, 12:31 PM IST

టాలీవుడ్ కు యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. తాజాగా ‘ఎన్టీఆర్30’ నుంచి అప్డేట్ అందింది.
 


ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. తాజాగా ‘ఎన్టీఆర్30’ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ప్రకటించారు. అతిలోక సుందరి, దివంగత సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వడంతో బాలీవుడ్ లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపించింది. వరుస అవకాశాలతో హిందీ ప్రేక్షకులను అలరించింది. ఈక్రమంలో టాలీవుడ్ ఎంట్రీపైనా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోయిన్ గా కన్ఫమ్ అయ్యిందని అభిమానుల్లో, సినీ వర్గాల్లో టాక్ నడించింది...  తాజాగా అదే నిజమైంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్  - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం NTR30. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం  అందిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. కొద్ది సేపటి కింద హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ను అనౌన్స్ చేశారు. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆమె పాత్ర గురించి కాస్తా వివరించే ప్రయత్నమూ చేశారు. ‘ఎన్టీఆర్30 ప్రపంచంలోని భయంకరమైన తుఫానులో ప్రశాంతత ఆమె’ అంటూ ఎన్టీఆర్3‌0లోకి ఆహ్వానించారు. 

Latest Videos

ఫస్ట్ లుక్ లో జాన్వీ చాలా అందంగా కకనిపిస్తున్నారు. నదీ తీరాన కొండపై కూర్చొని అందంగా నవ్వుతూ.. ఎవరి వంకో చూస్తున్నట్టు గా స్టిల్ ఇచ్చింది. ఈ లుక్ కనిపించిన జాన్వీ ఎన్టీఆర్ కు జోడీగా వెండితెరపై అదరగొడుతుందనే భావన కల్పిస్తోంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాన్వీ కపూర్ ను బర్త్ డే విషెస్ తెలుపుతూ.. టాలీవుడ్ కు స్వాగతం పలుకుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ - శ్రీదేవి కాంబోతో తర్వాత..  యంగ్ టైగర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ కాంబో సెట్ అవ్వడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇప్పటికే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించబోతుండటంపై ఆయా ఇంటర్వ్యూలు, టాక్ షోలలో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైనల్ గా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోనుంది. ‘ఎన్టీఆర్30’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండోసారి నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

She's the calm in the storm from the fierce world of ❤️

Happy Birthday and welcome onboard 💫 pic.twitter.com/g1sKFxuIir

— NTR Arts (@NTRArtsOfficial)
click me!