జాన్వీ కపూర్ ఫిట్ నెస్ ఫీట్.. మీరూ ఓ లుక్కేయండి!

Published : Aug 17, 2019, 01:36 PM IST
జాన్వీ కపూర్ ఫిట్ నెస్ ఫీట్.. మీరూ ఓ లుక్కేయండి!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో ఫిట్నెస్, పర్ఫెక్ట్ బాడీ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే జాన్వీ తన శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకుంటుంది. లేటెస్ట్ గా జాన్వీ పర్సనల్ ట్రైనర్ నమ్రత పురోహిత్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీకపూర్. మొదటి సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 'కార్గిల్ గర్ల్', 'తక్త్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. ఈ బ్యూటీ ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ తీసుకుంటుంది.

జిమ్ లో ఎక్కువగా కసరత్తులు చేస్తుంటుంది. ఒక్క రోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండదు. జిమ్ దుస్తుల్లో పబ్లిక్ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఫిట్నెస్, పర్ఫెక్ట్ బాడీ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే జాన్వీ తన శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకుంటుంది.

లేటెస్ట్ గా జాన్వీ పర్సనల్ ట్రైనర్ నమ్రత పురోహిత్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నమ్రత, జాన్వీ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ అరుదైన ఫీట్ తో కనిపించారు. ఈ వర్కవుట్ ప్రత్యేకతను రివీల్ చేశారు నమ్రత.

ఈ పొజిషన్ బాడీ టోనింగ్ లో భాగంగా మజిల్స్ ని బలంగా చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటో చూసిన అభిమానులు జాన్వీ ఫిట్నెస్ కి ఫిదా అవుతున్నారు.   

 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?