పవన్ రాజకీయాలను వదిలేస్తున్నాడా..? ఇదిగో క్లారిటీ!

Published : Sep 03, 2019, 10:00 AM ISTUpdated : Sep 03, 2019, 11:02 AM IST
పవన్ రాజకీయాలను వదిలేస్తున్నాడా..? ఇదిగో క్లారిటీ!

సారాంశం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అవాస్తమని తెలుస్తోంది.   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. పవన్ తన రాజకీయాలు వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో ఓ లెటర్ కూడా సర్క్యులేట్ అయింది. దీంతో పవన్ టీం స్పందించక తప్పలేదు.  సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. పవన్ పేరిట ప్రచారం అవుతోన్న ఆ లేఖ కట్టుకథలతో కూడినదని పేర్కొంది.

జనసేనానికి ఉన్న అభిమానగణం, ఆయన పేరుతో జరుగుతోన్న సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు ఈ విధంగా తప్పుడు లేఖలు సృష్టిస్తున్నట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయమై కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాడడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని.. దానికి ఆయన ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?