పిచ్చి ప్రవర్తనతో మరోసారి దెబ్బలు తిన్న నటుడు!

Published : Sep 03, 2019, 09:45 AM ISTUpdated : Sep 03, 2019, 05:58 PM IST
పిచ్చి ప్రవర్తనతో మరోసారి దెబ్బలు తిన్న నటుడు!

సారాంశం

బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, కన్నడ నటుడు హుచ్చ వెంకట్‌ తన వింత చేష్టలతో మరోసారి దెబ్బలు తిన్నాడు. రెండు రోజుల క్రితం కొడగులో తన వైపు ఎందుకు వింతగా చూస్తున్నారంటూ ఇతరుల కారు అద్దాలను వెంకట్‌ ధ్వంసం చేశాడు.  

కన్నడ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టంట్ హుచ్చ వెంకట్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. రెండు రోజుల క్రితం కొడగులో తనవైపు ఎందుకు వింతగా చూస్తున్నారంటూ ఇతరుల కారు అద్దాలను వెంకట్ ధ్వంసం చేశాడు.

దీంతో స్థానికులు అతడిని చితకబాదారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మండ్య నగరానికి వచ్చి ఒక హోటల్ లో దిగిన హుచ్చ వెంకట్ ఆదివారం ఉదయం మరోసారి పిచ్చిగా ప్రవర్తించాడు. హోటల్ ముందు నిలిపి ఉన్న గుర్తు తెలియని కారు అద్దాలను పగలగొట్టాడు వెంకట్.

తన పిచ్చి ప్రవర్తనతో షాక్ అయిన కారు యజమాని హుచ్చ వెంకట్ మీద దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హుచ్చ వెంకట్ ని తీసుకొని వెళ్లారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..