జనసేన పార్టీలోకి బన్నీ వాసు!

Published : Mar 08, 2019, 03:21 PM IST
జనసేన పార్టీలోకి బన్నీ వాసు!

సారాంశం

అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలు చూసుకుంటూ గీతాఆర్ట్స్ బ్యానర్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు బన్నీ వాసు. అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కూడా. 

అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలు చూసుకుంటూ గీతాఆర్ట్స్ బ్యానర్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు బన్నీ వాసు. అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కూడా. ఇటీవల కాలంలో నిర్మాతగా మారి సినిమాలు తీయడం కూడా మొదలుపెట్టాడు.

ఇప్పుడు సినిమాల నుండి రాజకీయాల వైపు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.  అల్లు ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్ తో ఉన్న విబేధాలు తొలగిపోవడంతో బన్నీ వాసు 'జనసేన' పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

అల్లు అర్జు స్వస్థలమైన పాలకొల్లు నియోజకవర్గం నుండి బన్నీ వాసు జనసేన పార్టీ తరఫున బరిలో దిగుతాడని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం సంగతి పక్కన పెడితే బన్నీ వాసుకి జనసేన పార్టీలో చోటు అయితే కన్ఫర్మ్ అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ నెల 14న రాజమండ్రిలో జరిగే జనసేన ఆవిర్భావ సభని పర్యవేక్షించే కమిటీ సభ్యుల్లో బన్నీ వాసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కమిటీ సభ్యులందరికీ జనసేన పార్టీ తరఫున టికెట్ ఖాయమని చెబుతున్నారు. దాదాపు పదిహేను మంది కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీ స్వస్థలం కావడంతో పాలకొల్లులో బన్నీ వాసుకి కాస్త ఫాలోయింగ్ ఏర్పడింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?
Gunde Ninda Gudi Gantalu: ఓవైపు శివ, మరోవైపు ప్రభావతి.. బాలు, మీనా కాపురంలో చిచ్చు పెట్టేశారుగా..!