బాలీవుడ్ లో విషాదం.. నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతి, ప్రముఖుల సంతాపం

Published : Mar 09, 2023, 07:37 AM ISTUpdated : Mar 09, 2023, 07:45 AM IST
బాలీవుడ్ లో విషాదం.. నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతి,   ప్రముఖుల సంతాపం

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. స్టార్లు వరుసగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. అన్ని భాషల్లో ఇదే పరిస్థితి. రీసెంట్ గా టాలీవుడ్ లో వరుసగానటులు మరణించగా.. బాలీవుడ్ లో తాజాగా నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ కన్నుమూశారు. 

బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ కన్నుమూశారు. 66 ఏళ్ల వయస్సులో ఆయన ఈరోజు (09 మార్చి) తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గతంలో కోవిడ్ బారిన పడిన సతీష్.. అప్పటి నుంచీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక కొంత కాలంగా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటం.. ఈరోజు తెల్లవారుజామున అది విషమించడంతో.. ఆయన కన్నుమూశారు. సతీష్ కౌశిక్ మరణ వార్తను  బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. 

సోషల్ మీడియా వేదికగా ఆయన  సతీష్ కౌశిక్ కు నివాళి అర్పించారు. సతీష్ ఫోటోను శేర్ చేస్తూ.. మరణం ఈ ప్రపంచంలోని చివరి సత్యం అని నాకు తెలుసు అంటూ అనుపమ్ ట్వీట్ చేశారు.  అయితే బ్రతికున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తాను అని అనుకోలేదు అంటూ అనుపమ్ కేర్ బాధపడ్డారు. మా 45 ఏళ్ల స్నేహానికి పుల్ స్టాప్ ... ఓం శాంతీ అంటూ అనుపమ్ ఖేర్ తన ట్వీట్ లో వెల్లడించారు. 

 

 

సతీష్ కౌశిక్ మరణ వార్తతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ స్టార్స్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు నటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇక సతీష్ కౌశిక్ గురించి చూస్తే.. ఆయన హర్యానాలో 1956  ఏప్రిల్ లో జన్మించారు. 1983 లో వచ్చిన మసూమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు కౌశిక్.  హాస్యనటుడిగా బాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించిన సతీష్ కౌశిక్.. 1990 లో రామ్ లఖన్, 1997 లో సాజన్ చలే ససురాల్ సినిమాలకు ఉత్తమ హాస్యనటుడిగా  ఫిల్మ్ ఫేర్ ను అందుకున్నారు. 

ఇక రూప్ కా రాణీ చోరోకా రాజా సినిమాతో 1993 లో దర్శకుడిగా అవతారం ఎత్తాడు సతీష్ కౌశిక్.  పలు విజయవంతమైన చిత్రాలకు సతీష్ దర్శకత్వం వహించారు. హాస్యనటుడిగా.. దర్శకుడిగా బాలీవుడ్ లో సక్సెసె ఫుల్ లైఫ్ ను లీడ్ చేశారు సతీష్. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ తో ఆయన స్నేహం చాలా బలమైనది. ఇద్దరు కలిసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. అనుపమ్ నిర్మాతగా.. సతీష్ డైరెక్షన్ ల్ సినిమాలు రూపొందించారు. వీరి కలయికతో మొదట తెరకెక్కిన సినిమా తేరే సాంగ్. సతీష్ కౌశిక్ మరణం బాలీవుడ్ ను కలిచివేస్తుంది. ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా