అవతార్2 టీమ్ కు బిగ్ షాక్..రిలీజ్ కు ముందే లీక్ అయిన మొత్తం సినిమా

Published : Dec 16, 2022, 06:46 AM IST
అవతార్2  టీమ్ కు బిగ్  షాక్..రిలీజ్ కు ముందే లీక్ అయిన మొత్తం సినిమా

సారాంశం

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అవతార్ 2 మూవీ ఇండియా టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. రిలీజ్ ముందు రోజే..కోలుకోలేని దెబ్బ కొట్టారు పైరసీ టీమ్.

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు  జేమ్స్ కామెరూన్ రూపోందించిన విజ్యూవల్ వండర్ అవతార్2. అవతార్  సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  అవతార్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. దాంతో అవతార్ 2 పై అదే రేంజ్ లో అంచనాలు  క్రియేట్ అయ్యాయి.   ఈక్రమంలోనే అవతార్ టీమ్ కు పెద్ద షాక్ తగిలింది. ఈమూవీ ముందురోజు అనగా నిన్ననే మూవీ టీమ్ కు  పైరసీదారులు షాకిచ్చారు. 

గురువారమే ఈ సినిమా  లీక్ చేశారు. మొత్తం సినిమాను ఆన్ లైన్ లో పెట్టారు. లండన్ లో ఈ నెల 6వ తేదీనే అవతార్  విడుదల కావడంతో... అవతార్  కాపీని టెలీగ్రామ్ తో పాటు టోరెంట్ సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో, చాలా వరకూ ఈసినిమాను  డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లింక్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అద్భుతమైన రెస్పాన్స తో పాటు భారీ స్థాయిలో బుక్కింగ్స్ జరిగాయి అవతార్2 సినిమాకు. రిలీజ్ కు ముందే ఇలా జరగడంతో.. సినిమా కలెక్షన్స్ పై ఈ ప్రభావం పడే అకాశం ఉంది.

13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ విజువల్ వండర్ అవతార్.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. హాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.  ఇక ఇన్నేళ్లకు అవతార్ 2 వస్తోంది. ద వే ఆఫ్ వాటర్ పేరుతో  ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.  తెలుగు,ఇంగ్లిష్ తో పాటు పలు 160 కి పైగా భాషల్లో రిలీజ్ అయ్యింది సినిమా. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషతదో పాటు మరికొన్ని భాషల్లో ఈ మూవీ సందడి చేయబోతోంది. 

రిలీజ్ అవ్వకముందే రికార్డ్  లను వేటాడేసింది అవతార్2 సినిమా. మన దేశంలో ... మన సినిమాల పేరిట ఉన్న రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసేసింది అవతార్ సీక్వెల్ మూవీ. ఇండియాలో సంచలనాలు సృష్టిస్తోంది.అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు తిరగరాసింది. ఇండియాలో అవతార్ 2 కోసం ఇప్పటికే   4,41,960 మంది అడ్వాన్స్‌ బుకింగ్స్ చేసుకున్నారట. అప్పటి వరకూ ఈ రికార్డ్ కెజిఎఫ్ పేరిట ఉండగా.. అవతార్2 ఆ ప్లేస్ ను కొట్టేసింది. ఇక సినిమా మెయిన్ కలెక్షన్స్ విషయంలో కూడా భారీ అంచనాలు ఉండగా..  ఈ పైరసీ వ్యావహరం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?