
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన `జైలర్` మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గురువారం విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ మొదటి వీకెండ్‌లోనే కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేస్తుంది. వీకెండ్‌లో ఏకంగా మూడు వందల కోట్లు దాటడం విశేషం. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్లని సాధించడం ఆశ్చర్యపరుస్తుంది. రజనీ ఇక కలెక్షన్ల వేట సాగిస్తున్నారని చెప్పొచ్చు.
ఈ సినిమా ఓవర్సీస్‌లో దుమ్మురేపుతుంది. ఏకంగా సుమారు రూ.130కోట్లకుపైగా కలెక్షన్లు ఓవర్సీస్ నుంచే రావడం విశేషం. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లోనూ ఇది రచ్చ చేసింది. ఇక ఇండియాలో రూ.190కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తమిళనాడులో ఇది రూ.95కోట్లు వసూలు చేయగా, ఏపీ, తెలంగాణలో 32కోట్లు వసూలు చేసింది. కర్నాటకలోనూ ఆల్మోస్ట్ సేమ్. అక్కడ కూడా రూ.32.50కోట్లు రాబట్టింది. ఇక కేరళాలో ఊహించని కలెక్షన్లు వచ్చాయి. అక్కడ 23కోట్లు వసూలు చేయడం ఆశ్చర్యపరుస్తుంది. చిన్న స్టేట్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు అంటే షాక్‌కి గురి చేస్తుంది.
కేరళాలో రజనీకి ఉన్న రేంజ్, పైగా అక్కడ మోహన్‌లాల్ మార్కెట్ కూడా కలిసొచ్చింది. సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అది `జైలర్` కలెక్షన్లకి తోడయ్యింది. దీంతో మాలయాళంలో ఈ సినిమా దుమ్మురేపింది. ఇక నార్త్ లో ఈ సినిమా కేవలం ఏడు కోట్లు చేసింది. అక్కడ `గదర్ 2`, `ఓఎంజీ2`లు బాగా ఆడుతున్న నేపథ్యంలో `జైలర్` సత్తా చాటలేకపోయింది. వాటి ప్రభావం రజనీ సినిమాపై గట్టిగా పడింది. లేదంటే నార్త్ లోనే ఈ సినిమాకి ముప్పై కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చేవి. మొత్తానికి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.300కోట్ల(320) క్లబ్‌లో చేరిపోయింది. మరో రెండు వారాల పాటు ఈ చిత్రానికి తిరుగులేదు. మొత్తంగా ఇది 500వందల కోట్ల మార్క్ కి రీచ్ అవుతుందని చెప్పొచ్చు. తెలుగులో 50-60కోట్ల వరకు రాబట్టవచ్చు. ఇక్కడ కేవలం 10కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. మిగిలినవన్నీ లాభాలే అని చెప్పొచ్చు.
ఇక రజనీకాంత్ హీరోగా, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ లుగా మెరిసిన `జైలర్` చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా, ఇందులో తమన్నా హీరోయిన్‌గా కనిపించింది. సునీల్ కీలక పాత్రలో మెరిశారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 10న ఈ చిత్రం విడుదలైంది.