‘విరూపాక్ష’టీమ్ నెక్ట్స్ ప్రకటన.. హీరో సాయితేజ కాదు మరి?

Published : Aug 14, 2023, 02:58 PM IST
‘విరూపాక్ష’టీమ్ నెక్ట్స్  ప్రకటన.. హీరో సాయితేజ కాదు మరి?

సారాంశం

‘విరూపాక్ష’ మేకర్స్‌ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ కోసం కలిశారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 


ఓ కాంబినేషన్ హిట్ అయ్యిందంటే దాని సీక్వెల్ అయినా వస్తుంది లేదా ఆ కాంబినేషన్ అయినా రిపీట్ అవుతుంది . ఇప్పుడు విరూపాక్ష టీమ్ అదే చేయబోతోంది. తమ కాంబోలో మరో థ్రిల్లర్ కు రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. మరి హీరో ఎవరంటారా..

 ‘విరూపాక్ష’ (Virupaksha)తో ఈ సంవత్సరం పెద్ద సక్సెస్ ని  అందుకున్నారు డైరక్టర్ కార్తిక్‌ దండు (Karthik Varma Dandu).ఈ చిత్రం ప్రీ పోస్టర్‌ నుంచి సినిమాపై కార్తిక్‌ మంచి హైప్‌ను క్రియేట్‌ చేయటం మొదలెట్టారు. ఇక టీజర్‌, ట్రైలర్‌లు కూడా ఓ  రేంజ్‌లో ఉండటంతో  విరూపాక్ష కు రిలీజ్ కు ముందే  బజ్‌ ఏర్పడింది. అదిరిపోయే ఓపినింగ్స్ వచ్చాయి. అలాగే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కార్తిక్‌ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కార్తీక్ దండు  టేకింగ్‌, విజన్‌కు సుకుమార్‌ బలం తోడవ్వడంతో విరూపాక్ష సంచలన విజయం సాధించింది. సుకుమార్‌ రైటింగ్స్‌ - శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. 

కాగా, ‘విరూపాక్ష’ మేకర్స్‌ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ కోసం కలిశారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కార్తిక్‌ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ - ఎస్‌వీసీసీ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నాయి. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదో మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌.  అయితే హీరో ఎవ‌ర‌న్న‌ది ఖ‌రారు కాలేదు. కార్తీక్ దండు అఖిల్ తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఇది వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌కి అఖిల్ చేస్తాడా లేదా అనే క్లారిటీ లేదు. మ‌రో యంగ్ హీరోతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తే అవ‌కాశం ఉంది. సుకుమ‌ర్ రైటింగ్స్ సినిమా, పైగా విరూపాక్ష టీమ్ కాబ‌ట్టి.. ఏ హీరోకి క‌థ చెప్పినా ఓకే అనే అవ‌కాశాలున్నాయంటున్నారు. నిఖిల్ కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే