నేను మోసపోయా.. వాళ్ళతో మీరూ జాగ్రత్తగా ఉండండి: జగపతి బాబు

Published : May 29, 2024, 06:09 AM IST
 నేను  మోసపోయా.. వాళ్ళతో  మీరూ జాగ్రత్తగా ఉండండి: జగపతి బాబు

సారాంశం

నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు...


జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్​ లోనూ  ఫుల్ బిజీగా ఉన్నారు. విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మోసపోయానన్నారు. స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu). దానికి తానూ బాధితుడినేనని వాపోయారు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. 
 
 ‘రియల్ ఎస్టేట్​ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్​గా హెచ్చరించారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్​ యాడ్​లో నేను యాక్ట్ చేశా. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి’ అని జగపతి బాబు పేర్కొన్నారు.

సె విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్న జగపతి బాబు ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే