మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై బాలయ్య క్రేజీ అప్‌ డేట్‌.. తనని, తాతని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవద్దంటూ ట్విస్ట్

Published : May 28, 2024, 10:52 PM IST
మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై బాలయ్య క్రేజీ అప్‌ డేట్‌.. తనని, తాతని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవద్దంటూ ట్విస్ట్

సారాంశం

నందమూరి బాలకృష్ణ తాజాగా విశ్వక్‌ సేన్‌ `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చాడు. కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు బాలయ్య.   

నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఆయన నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుంది. ఆయన విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్‌ ఇచ్చాడు బాలయ్య. త్వరలో మా వాడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని తెలిపారు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నట్టుగా తెలిపారు. 

అయితే సినిమాల్లోకి వచ్చే విషయంలో తననిగానీ, తాతగారు(ఎన్టీఆర్‌)నిగానీ స్ఫూర్తిగా తీసుకోవద్దని తాను చెబుతానని, యంగ్‌ కుర్రాళ్లని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని తాను చెబుతానని తెలిపాడు. విశ్వక్‌ సేన్‌, అడవి శేష్‌, సిద్దు జొన్నలగడ్డ వంటి మన కుర్రాళ్ల టీమ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటాను. ఇప్పటి తరం కుర్రాళ్లు ఎలా రాణిస్తున్నా చూసి నేర్చుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి ఎదగాలని తెలిపారు బాలయ్య. తన కొడుకు మోక్షజ్ఞకి ఈ విషయాలు తెలిపారు. 

అయితే తాము బ్యాక్‌ బోన్‌లా ఎప్పుడూ ఉంటామని, ఆ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అవసరమైనప్పుడు తాము వెంటే ఉంటామన్నారు బాలకృష్ణ. మొత్తానికి త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా రాబోతున్నారనే హింట్‌ మాత్రం బాలయ్య నుంచి వచ్చింది. సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం చూపించాలని, నాన్నగారి నుంచి తాను నేర్చుకున్నది అదే అని, దాన్నే ఫాలో అవుతున్నానని, నేటి తరం కూడా దాన్ని ఫాలో అవ్వాలని తెలిపారు బాలయ్య. 

విశ్వక్‌ సేన్‌, నేహాశెట్టి, అంజలి హీరోహీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికేట్‌ని పొందింది. ఇక నేడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో  ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు. విశ్వక్‌ సేన్‌తో సరదాగా మాట్లాడాడు. అన్నగా పిలిచాడు. ట్రైలర్‌, టీజర్‌ బాగుందని, గోదావరి అందాలతోపాటు మంచి ఎమోషన్ కూడా ఉందని, మంచి కిక్కించే సినిమాలా ఉందన్నారు బాలయ్య. టైటిల్‌ విభిన్నంగా ఉందని, సినిమాపై ఆసక్తి పెంచుతుంది, సినిమా పెద్ద విజయం సాధించాలని, సక్సెస్‌ మీట్‌లో తాను మరిన్ని విషయాలు మాట్లాడతానని తెలిపారు. దర్శకుడు, నిర్మాతలు, హీరోయిన్లకి అభినందనలు తెలిపారు బాలయ్య. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా