హైపర్ ఆది లేడు, అనసూయ రాదు ఇక 'జబర్దస్త్' చూస్తారా..?

Published : Nov 28, 2018, 03:24 PM IST
హైపర్ ఆది లేడు, అనసూయ రాదు ఇక 'జబర్దస్త్' చూస్తారా..?

సారాంశం

నాన్ వెజ్ కామెడీ అంటూ 'జబర్దస్త్' కామెడీ షోపై ఎన్ని విమర్శలు చేసినా.. ప్రేక్షకుల్లో ఆ షోపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఒకానొక దశలో పాత కమెడియన్స్ అందరూ షో నుండి వెళ్లిపోయినా.. టీఆర్పీ రేటింగ్స్ మాత్రం తగ్గలేదు. హైపర్ ఆది తన కామెడీ పంచ్ లతో ఆడియన్స్ ను మెప్పించడం మొదలుపెట్టాడు. 

అతడి స్కిట్ కోసం జనాలు ఎదురుచూడడం మొదలుపెట్టారు. యూట్యూబ్ లో అతడి స్కిట్ లకు మాత్రమే విపరీతమైన వ్యూస్ వచ్చేవి. తన స్కిట్ లతో షోని నిలబెట్టాడు. అలాంటిది కొద్దిరోజులుగా జబర్దస్త్ షోలో ఆది కనిపించడం లేదు. మొదట టెంపరరీ బ్రేక్ అనుకున్నప్పటికీ ఆ తరువాత షోకి పూర్తిగా దూరమయ్యాడని తెలుస్తోంది.

దీంతో షోపై జనాలకి కాస్త ఆసక్తి తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు కొత్తదనం కోసం యాంకర్ అనసూయని కూడా తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. టెంపరరీగా యాంకరింగ్ చేయడానికి వచ్చిన వర్షిణిని ఇప్పుడు యాంకర్ గా కంటిన్యూ చేయాలని చూస్తున్నారట.

తన గ్లామర్ టచ్ తో షోపై ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేసింది అనసూయ. ముఖ్యంగా అనసూయపై హైపర్ ఆది వేసే పంచ్ లు షోకి హైలైట్ గా నిలిచేవి. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ షోకి దూరమవ్వడంతో ఇక షోని జనాలు చూస్తారా..? అనే సందేహాలు మొదలయ్యాయి. వీరిద్దరూ లేకపోవడం షోపై కొంత ప్రభావమైనా చూపే అవకాశాలు ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

ఇక 'జబర్దస్త్'లో అనసూయ కనిపించదా..?

హైపర్ ఆది రూ.2కోట్ల విలువైన పొలం కొన్నాడట!

'జబర్దస్త్' నుండి హైపర్ ఆది ఔట్..?

PREV
click me!

Recommended Stories

ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు
Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!