షారుక్ సినిమాలో శ్రీదేవి.. జీరో టీమ్ సర్‌ప్రైజ్!

Published : Nov 28, 2018, 03:03 PM ISTUpdated : Nov 28, 2018, 03:05 PM IST
షారుక్ సినిమాలో శ్రీదేవి.. జీరో టీమ్ సర్‌ప్రైజ్!

సారాంశం

ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి నటించిన చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె చివరగా నటించిన చిత్రం జీరో. 

ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి నటించిన చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె చివరగా నటించిన చిత్రం జీరో. ముందుగా ఈ విషయం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కేవలం ఒక సాంగ్ లో స్పెషల్ గా వచ్చి వెళుతుందని తెలిసింది. 

ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ మరగుజ్జు పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ కి అలాగే ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. కత్రినా కైఫ్ అనుష్క శర్మ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీదేవి ఒక పాటలో షారుక్ తో కలిసి స్టెప్పులేయనుందని సమాచారం. ఈ విషయం గురించి జీరో చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు స్పందించడం లేదు. 

అయితే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఆమెకు సంబందించిన లుక్స్ ని కూడా బయటపెట్టడం లేదట. శ్రీదేవి మరణం కంటే ముందే ఈ తరహా ప్లాన్ ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై గౌరి ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్
Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం చూపించాడా?