Chiranjeevi: పద్మవిభూషణ్ వరించిన వేళ.. మెగా కోడలు అభినందన సభ.. హాజరైన తెలంగాణ సీఎం

By Rajesh Karampoori  |  First Published Feb 3, 2024, 11:57 PM IST

Chiranjeevi: దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ వరించిన చిరంజీవికి మెగా కోడలు ఉపాసన ఓ సర్ ప్రైజ్ ఫ్లాన్ చేసింది. తన నివాసంలో అభినందన సభను చాలా గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.  


Chiranjeevi:  తెలుగు చిత్ర సీమకు చేసిన విశేష సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇంతటి ఘనతన సాధించినందుకు మెగాస్టార్ కు సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

కాగా.. దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ వరించిన చిరంజీవికి మెగా కోడలు ఉపాసన ఓ సర్ ప్రైజ్ ఫ్లాన్ చేసింది. తన నివాసంలో అభినందన సభను ఏర్పాటు చేసింది. చాలా గ్రాండ్ పార్టీని ఇచ్చింది. ఈ అభినందన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం.. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తెలిపారు.

Latest Videos

click me!