తింటుంటే ప్లేట్ లాగి మెడపట్టి గెంటేశారు : గెటప్ శీను

First Published Feb 20, 2018, 10:51 AM IST
Highlights
  • చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదు.
  • కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాల ఎన్నో ఎదుర్కొన్నా.

జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు.

.నా ఇంటికి మల్లెమాల నిలయం అని పేరు పెట్టుకున్నా. ఆ సంస్థకు ఎప్పుడూ రుణపడి ఉండాలని తనకు ఎప్పుడూ అలా కనిపిస్తూ ఉండాలని అలా పెట్టుకున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చిన సంస్థ, మేము ఈ స్థాయికి రావడానికి కారణం ఆ సంస్థ....మల్లెమాల సంస్థను ఎప్పుడూ మరిచిపోను అని గెటప్ శ్రీను తెలిపారు.
 


2007లో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ....అక్కడ ఏదో షూటింగ్ ఓపెనింగ్ జరుగుతుండగా చూడటానికి వెళ్లాను. అక్కడ ప్రొడక్షన్లో తెలిసిన వ్యక్తి ఉంటే షూటింగ్ కాసేవు రమ్మంటే వెళ్లాను, ఆయన తినమంటే భోజనం చేస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఇంచార్జి వచ్చి ఎవడ్రా నువ్వు అని అడిగారు. తెలిసిన వారి ద్వారా లోనికి వచ్చాను అంటే... నన్ను బూతులు తిట్టారు. ప్లేటు లాగేసి కాలరు పట్టుకుని బయటకు గెంటేశారు.... అని గెటప్ శ్రీను తెలిపారు.అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆ సంఘటనో దాదాపు వారం రోజుల వరకు నాకు ఏడుపు ఆగలేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేవాడిని. చాలా అవమానం అనిపించింది. ఏదైనా పని చేసుకుని తినొచ్చుకదా... అక్కడే ఎందుకు తిన్నాను... ఇలా రకరకాలుగా ఆలోచనలు వచ్చేవి. అపుడే అనుకున్నా ఇదే స్టూడియోలో ఎప్పటికైనా నటించాలని. అనుకున్నది జరిగింది. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో ఇపుడు జబర్దస్త్ షూటింగ్ జరుగుతోంది. నేను కెరీర్లో ఎంత సక్సెస్ అయ్యాననే విషయం పక్కన పెడితే. ఒకప్పుడు నన్ను గెంటేసిన చోటే ఇపుడు నేను షూటింగులో చేస్తుండటం ఆనందంగా ఉంది అని.... గెటప్ శ్రీను తెలిపారు.


మా అమ్మ నాన్నకు ఇండస్ట్రీ అంటే, సినిమా అంటే తెలియదు. వ్యవసాయ కుటుంబం. మా అన్నయ్యకు ఇండస్ట్రీ గురించి తెలుసు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఇంటర్ అయిపోయాక చదువు మధ్యలో మానేసి అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో ఏదైనా జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అదే సమయంలో సినిమా అవకాశాల కోసం తిరగొచ్చు అనే వచ్చేశాను.... అని గెటప్ శ్రీను తెలిపారు.


చిన్నతనంలో ‘ఖైదీ' సినిమా చూసి యాక్టర్ అవ్వాలని ఇన్స్‌స్పైర్ అయ్యాను. 2004లో హైదరాబాద్ వచ్చాను. మొదట్లో అవకాశాల కోసం చాలా తిరిగాను. జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చింది, ఎంతో గుర్తింపు ఇచ్చింది. నాగ బాబు గారికి నేను రుణపడి ఉంటాను. నా స్కిట్లు చూపించి ఆయనే నాకు ఖైదీ నెం 151లో చిన్న అవకాశం ఇచ్చారు. ఖైదీ సినిమా చూసి ఇన్ స్పైర్ అయి చిరంజీవి లాగా ఇండస్ట్రీకి వెళదామని అనుకుని ఖైదీ నెం 151లో చేయడం నిజంగా అదృష్టం.... అని గెటప్ శ్రీను తెలిపారు.
నాకు గాడ్ ఫాదర్ నా ఫ్రెండ్ మ్యాగీ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నాడు. వాడితో కలిసి నాగోల్‌లో ఉండేవాడిని. వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇద్దరం చాలాసార్లు తిండి కోసం కష్టపడిన సందర్భాలు ఉన్నాయిన అని.... గెటప్ శ్రీను తెలిపారు.

click me!