
జబర్దస్త్ ఇమ్మానియేల్ ఆనందంతో ఉబ్బితబ్బవుతున్నాడు. దానికి కారణం అతడు తన కల నెరవేర్చుకోవడమే. కారు కొనాలి అందులో విహరించాలన్న ఇమ్మానియేల్ కోరిక తీరింది. ఇమ్మానియేల్ రెడ్ కలర్ హ్యుందాయ్ కార్ కొన్నారు. ఇక కొత్త కారు పక్కనే నిల్చొని ఫోజులిచ్చారు. ఇమ్మానియేల్ హ్యాపీ మూమెంట్స్ లో మరో కమెడియన్ రోహిణి జాయిన్ అయ్యారు. ఫైనల్ గా నా కల నెరవేరింది. నా లైఫ్ లో ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ సపోర్ట్, ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు అంటూ... ఇమ్మానియేల్ కామెంట్ చేశాడు.
ఇమ్మానియేల్ జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. ఈ మధ్య జబర్దస్త్ లో అతడి హవా పెరిగింది. సీనియర్స్ చాలా మంది షోని వదిలిపోగా ఇమ్మానియేల్ వంటి జూనియర్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇమ్మానియేల్ ఫేమస్ కావడానికి ముఖ్య కారణం... వర్షతో లవ్ ట్రాక్. రష్మీ-సుడిగాలి సుధీర్ మాదిరి వీరిద్దరూ బుల్లితెర లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వర్షతో ఇమ్మానియేల్ లవ్ ట్రాక్ సూపర్ సక్సెస్ కాగా ఫేమ్ వచ్చిపడింది.
ఆ దెబ్బతో బుల్లితెర పై ఆఫర్స్ పట్టేసి ఇమ్మానియేల్, వర్ష సెటిల్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు షోస్ లో ఇమ్మానియేల్ సందడి చేస్తున్నారు. అలాగే ఇమ్మానియేల్ కి సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. జబర్దస్త్ ఎందరికో లైఫ్ ఇవ్వగా ఇమ్మానియేల్ వారిలో ఒకడిగా దూసుకు వెళుతున్నాడు.