హాస్పిటల్ లో చలాకి చంటీ, ఐసీయూలో చికిత్స..? అసలేమయ్యింది..?

Published : Apr 23, 2023, 09:10 AM ISTUpdated : Apr 23, 2023, 09:40 AM IST
హాస్పిటల్ లో చలాకి చంటీ, ఐసీయూలో చికిత్స..? అసలేమయ్యింది..?

సారాంశం

జబర్థస్త్ స్టార్ కమెడియన్.. చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఈ వార్త తెగ హల్ చల్ చస్తోంది. ఇంతకీ ఆయనకు ఏమైంది అని ఆరాతీస్తుననారు ఫ్యాన్స్.  

చాలా కాలంగా తెరపై పెద్దగా కనిపించడంలేదు చలాకి చంటీ. జబర్థస్త్ ను వదిలిపెట్టి.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళిన చంటీ.. ఆతరువాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత పెద్దగా కనిపించంలేదు. పెద్దగా షోలు కూడా చేయలేదు. ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంటర్ అయ్యి.. జబర్థస్త్ స్టేజ్ ను బాగా ఉపయోగించుకుని బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఎదిగాడు చలాకి చంటీ. అంతే కాదు  సపరేట్ ఫ్యాన్స్ ను కూడా సంపాదించాడు. వెండితెరపై ఎన్నో అవకాశాలు కూడా అందుకున్నాయి.  కాని ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు చంటీ. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 

ఓవైపు షోలో టీమ్ లీడర్ గా చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తూ వచ్చారు. తనదైన పంచులతో, కామెడీతో కడుపుబ్బా నవ్వించే చలాకీ చంటి.. గత కొన్ని రోజులుగా బుల్లితెర మీద గానీ, వెండి తెర మీద గానీ కనిపించింది లేదు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారట. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు  తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారట.

లాస్ట్ ఇయర్  టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6లో  పాల్గొన్నారు చలాకి చంటీ. కానీ ఆయన బిగ్ బాస్ లో చివరి వరకూ ఉండలేదు. కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి వచక్చిన తరువాత పెద్దగా స్క్రీన్ పూ కనిపించలేదు చంటి.  ఒకటి, రెండు షోస్ తప్పించి పెద్దగా  కనిపించడమే మానేశారు. ఒక రకంగా  పూర్తిగా స్క్రీన్ కు దూరమైపోయారు. దీంతో చంటి  ఏమైపోయారు? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 

ఇక అసలు చంటీ ఏమైయ్యాడు.. కనిపించడంలేదు అని ఫ్యాన్స్ కంగారుపడుతుంటే.. ఇలాంటి సమయంలో చంటి హాస్పిటల్ లో చేరారని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే అసలు చంటికి ఏమైంది.. ఏంటీ అన్న సంగతి మాత్రం తెలియడం లేదు. ఆయన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం అయితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు మాత్రం  తెలుస్తోంది. అనారోగ్య సమస్య ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే జబర్థస్త్ బ్యాచ్ లో చాలా మంది అస్వస్థతతో బాధపడుతున్నారు. పంచ్ ప్రసాద్ లాంటివారు నరకం చూస్తున్నారు. దాంతో చలాకి చంటికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?