‘బలగం’ సీన్ గుర్తు చేసిన రచ్చ రవి.. తన చెల్లి ఇంటికి రావట్లేదని కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

By Asianet News  |  First Published Apr 1, 2023, 4:55 PM IST

‘బలగం’లో రచ్చ రవి తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే అచ్చం ఆ సినిమాలోని అన్నచెళ్లెల సీనే జబర్దస్త్ నటుడి జీవితంలో జరిగింది. తాజాగా ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 


‘జబర్దస్త్’ కమెడియన్ గా బుల్లితెర ఆడియెన్స్ లో రచ్చ రవి (Racha Ravi) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాస, భాషతోనే హిలేరియస్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఎన్నో కామెడీ స్కిట్లతో అలరించారు. ప్రస్తుతం సినిమాలతోనే బిజీ అయిపోయారు.  కమెడియన్ గానే కాకుండా నటుడిగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ‘గద్దలకొండ గణేష్’తో మెప్పించారు. ప్రస్తుతం ‘బలగం’తో తిరిగి  వచ్చారు.  రచ్చరవి  నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

Balagam సక్సెస్ సందర్భంగా రచ్చ రవి తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ సందర్భంగా తన ఇంట్లోనూ ‘బలగం’సీన్ రిలీట్ అయినట్టు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మా చెల్లి రజిత అంటే మాకు ప్రాణం. మా తమ్ముడు, నేను చాలా బాగా చూసుకునే వాళ్లం.  నేను సినిమాల్లోకి రావడంతో మా  చెల్లితో సరిగా మాట్లాడలేకపోయాయి. ఆ తర్వాత తనకు నచ్చజెప్పినా.. ఎన్నిమార్లు బతిమిలాడినా  కనికరం చూపించడం లేదు. నేను తప్పు చేస్తే తిట్టాలి లేదంటే కొట్టాలి.  కానీ ఇలా మాట్లాడకుండ ఉంటే చాలా బాధగా ఉంటుంది.  

Latest Videos

undefined

రాకీ పండగ వచ్చినా  నేనే చెల్లె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నారు. మా చెల్లి మాత్రం  మా ఇంటికి రావట్లేదు. చెల్లి రజిత ఇచ్చిన రూ.123తోనే నేను హైదరాబాద్ కు వచ్చాను. ఎన్నో కష్టనష్టాలకొచ్చి ఈ స్థాయికి వచ్చాను. నాకు మొదట్లో సమయం లేక మాట్లాడలేదు. అదే తప్పుగా భావించి ఏడేండ్లుగా ఇంటికి రానంటే రానంటోంది’ అంటూ రచ్చ రవి  వెక్కి  వెక్కి ఏడ్చారు. రీసెంట్ గా వేణు వెల్దండి దర్శకత్వం వహించిన ‘బలగం’ చిత్రంలోనూ అన్నా చెళ్లెళ్లు 20 ఏళ్లు ఒకరికొకరు మాట్లాడుకోకుండా.. చూసుకోకుండా దూరంగా ఉండే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం అందరినీ కదిలిస్తుంది. ఇక రచ్చ రవి జీవితంలోనూ అదే సీన్ ఉందంటూ బోరున ఏడ్చేశారు. 

ఫ్యామిలీ డ్రామాగా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం  ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నారు.  
శిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య  కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సుధాకర్ రెడ్డి,  మురళీధర్ గౌడ్ తోపాటు రచ్చ రవి ముఖ్య పాత్ర పోషించారు. చిత్రానికి లాస్ ఎంజిల్స్ నుంచి ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫి అవార్డు, అలాగే బెస్ట్ పీచర్ ఫిల్మ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 

click me!