పంచ్ ప్రసాద్ కి సర్జరీ చేయాలన్న డాక్టర్స్... దేవుడిని ప్రార్థిస్తున్న భార్య!

Published : Apr 09, 2023, 06:47 PM ISTUpdated : Apr 09, 2023, 06:54 PM IST
పంచ్ ప్రసాద్ కి సర్జరీ చేయాలన్న డాక్టర్స్... దేవుడిని ప్రార్థిస్తున్న భార్య!

సారాంశం

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు అనారోగ్యం తిరగబెట్టగా చికిత్స తీసుకుంటున్నారు.   

పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు రెగ్యులర్ గా డయాలసిస్ చేయించాల్సి ఉంది. ఈ కారణంగా ఆయన్ని పలురకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా పంచ్ ప్రసాద్ హెల్త్ అప్డేట్ ఆయన భార్య ఇచ్చారు. ఆయన పరిస్థితి తెలియజేస్తూ యూట్యూబ్ వీడియో షేర్ చేశారు. పంచ్ ప్రసాద్ గొంతు సమస్యతో బాధపడుతున్నారట. పరీక్షలు చేసిన వైద్యులు థైరాయిడ్ సమస్య ఉందని చెప్పారట. అది ఎక్కువ కావడంతో సర్జరీ చేయాలన్నారట. 

అయితే కాలిలో ఇన్ఫెక్షన్ చేరిందట. అది తగ్గాక మాత్రమే ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని చెప్పారట. ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో సమస్య తగ్గాలని కోరుకుంటున్నట్లు ఆమె దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధి వలన పంచ్ ప్రసాద్ అనేక ఇబ్బందులు గురవుతున్నారు. సంపాదనలో ఎక్కువ మొత్తం ట్రీట్మెంట్ కే ఖర్చు అవుతుంది. తోటి జబర్దస్త్ కమెడియన్స్ కొంతలో కొంత ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. 

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో అవకాశాలు ఇస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూనే ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. ఆ మధ్య కిరాక్ ఆర్పీ పంచ్ ప్రసాద్ కి సహాయం చేస్తానంటూ హామీ ఇచ్చాడు. పంచ్ ప్రసాద్ నా మిత్రుడు, మంచి వాడు. త్వరలో నేను మణికొండలో స్టార్ట్ చేయబోయే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ నుండి వచ్చే ఆదాయం పంచ్ ప్రసాద్ చికిత్సకు కేటాయిస్తాను అన్నాడు. పది లక్షలు ఖర్చైనా అతనికి చికిత్స చేయిస్తా అన్నాడు. మణికొండలో బ్రాండ్ స్టార్ట్ చేసిన కిరాక్ ఆర్పీ పంచ్ ప్రసాద్ కి ఏ మేరకు సహాయం చేశాడో తెలియదు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్‌ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్‌.. దేవుడిని మన కళ్లముందుంచాడంటూ పోస్ట్
Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?