జబర్దస్త్ కి ఏమైంది?... కమెడియన్ అదిరే అభి షాకింగ్ కామెంట్స్!

Published : Jan 29, 2023, 09:15 PM IST
జబర్దస్త్ కి ఏమైంది?... కమెడియన్ అదిరే అభి షాకింగ్ కామెంట్స్!

సారాంశం

జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పటి వైభవం జబర్దస్త్ లో లేదని పరోక్షంగా తెలియజేశారు.   


జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో. మల్లెమాల సంస్థ 2013లో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది. రోజా, నాగబాబు జడ్జెస్ట్ గా, అనసూయ యాంకర్ గా ఎంపికయ్యారు. రోలర్ రఘు, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర, ధనాధన్ ధన్ రాజ్, టిల్లు వేణు, రాకెట్ రాఘవ, షకలక శంకర్ టీం లీడర్స్ గా మొదలైంది. ఊహకు మించి షో సక్సెస్ అయ్యింది. పాత వాళ్ళు పలు కారణాలతో వెళ్లిపోయారు. మరింత టాలెంట్ ఉన్న కొత్త సరుకు దిగింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ సంచలనాలు చేశాయి. 

విపరీతమైన ఆదరణ వస్తుండగా ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేశారు. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే రెండు షోలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి. రష్మీ, అనసూయల దశ తిరిగింది. పలువురు కమెడియన్స్ నటులుగా సెటిల్ అయ్యారు. జబర్దస్త్ షో చరిత్ర చెప్పుకుంటూ పొతే పెద్ద పుస్తకమే అవుతుంది. అయితే మెల్లగా జబర్దస్త్ ప్రాభవం కోల్పోతూ వచ్చింది. మొదట నాగబాబు వెళ్ళిపోయాడు. ఆయన నిష్క్రమణ ఎలాంటి ప్రభావం చూపలేదు. 

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడం దెబ్బేసింది. జడ్జి రోజా, యాంకర్ అనసూయ కూడా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను మరలా తిరిగొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మంచి కాంబినేషన్ తో కూడిన పాత టీమ్స్ విచ్ఛన్నమయ్యాయి. షో నడవాలి కాబట్టి కొత్త వాళ్లతో నడుపుతున్నారు. వారు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. 

ఈ విషయాలను ప్రస్తావిస్తూ జబర్దస్త్ సీనియర్ కమెడియన్ అదిరే అభి వాపోయాడు. ఒకప్పటి వైభవాన్ని తలచుకుంటూ... ప్రస్తుత జబర్దస్త్ షోలో విషయం లేదని పరోక్షంగా చెప్పాడు. అదే సమయంలో ఎందరిలో అన్నం పెట్టిన అమ్మ మల్లెమాల అంటూ ఎమోషనల్ అయ్యారు. అదిరే అభి సుదీర్ఘ సోషల్ మీడియా సందేశం వైరల్ అవుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌
Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?