'జబర్దస్త్' అవినాష్ పెళ్లా?.. షాకింగ్ పిక్ షేర్!

By Surya PrakashFirst Published Jun 29, 2021, 4:27 PM IST
Highlights

 అందరూ పెళ్లి శుభాకాంక్షలు తెలియచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వధువు ఎవరు..  పెళ్లి ఎప్పుడు? నిజంగానే పెళ్లి జరుగుతోందా? అని రకరకాల డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

'జబర్దస్త్' రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు ముక్కు అవినాష్ బాగా పాపులర్. జబర్దస్త్ పోగ్రామ్ అవినాష్ కు లైఫ్ ఇచ్చింది. ఆ మధ్యన బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అవినాష్ కూడా పాల్గొన్నారు.ఆ షోలో అవినాష్- అరియనా మధ్య నడిచిన ట్రాక్ బాగా పాపులర్ అయ్యింది. సీజన్ ఫోర్ హిట్ లో అవినాష్  భాగస్వామ్యం కాదనలేనిది. ఈ నేపధ్యంలో అవినాష్ కు సంభందించిన ప్రతీ వార్త హాట్ టాపిక్ అవుతోంది. వైరల్ గా మారుతోంది. తాజాగా  అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  

ఈ విషయం ఎలా బయిటకు వచ్చిందంటే... పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న ఫోటోను అవినాష్ ఇనిస్ట్ర్గగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో అందరూ పెళ్లి శుభాకాంక్షలు తెలియచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వధువు ఎవరు..  పెళ్లి ఎప్పుడు? నిజంగానే పెళ్లి జరుగుతోందా? అని రకరకాల డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కొందరు మాత్రం ..ఇదేమీ నిజమైన పెళ్లి కాదు...ఇది కేవలం కామెడీ స్టార్స్ షో కోసమే అయి ఉంటుందని తేలికగా తీసిపారేస్తున్నారు. ఏదైమైనా అవినాష్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు.  

ఇక అవినాష్ బిగ్ బాస్ ఫినాలే అప్పుడు 2021 లో పెళ్లి చేసుకుంటానని తెలుపడంతో ఇప్పుడు అందరు అవినాష్ పెళ్లిచేసుకోబోయేది ఎవరిని అని తెగ ఎదురుచూస్తున్నారు. మరికొందరు అవినాష్ చేసుకోబోయే వధువు అరియనా అని అందరూ అనుకుంటున్నారు.అందుకు కారణం వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నపుడు నిజమైన ప్రేమికులుగా నటించారు. 

బిగ్ బాస్‌లో దాదాపు 90 రోజులు ఉన్న అవినాష్.. అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిందుకున్నాడు. అయితే ఆయన ఇంట్లో ఉన్నపుడు పెళ్లి గురించి కూడా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈయనకు పిల్లనెవరూ ఇవ్వరు అంటూ నాగార్జున కూడా చాలా కామెడీ చేసాడు. దాని బట్టి వీళ్ళు  నిజ జీవితంలో దంపతులు అవుతారని చాలా మంది ఫిక్స్ అయ్యారు. మరి అందరు అనుకున్నట్లుగా అవినాష్ అరియానని వివాహం చేసుకుంటారా లేదా అనేది వేచిచూడాలి.  
 

click me!