హాట్ టాపిక్:పవన్‌ కళ్యాణ్‌ కు బండ్ల గణేష్‌ కొత్త పేరు

Surya Prakash   | Asianet News
Published : Jun 29, 2021, 02:25 PM ISTUpdated : Jun 29, 2021, 02:27 PM IST
హాట్ టాపిక్:పవన్‌ కళ్యాణ్‌ కు బండ్ల గణేష్‌ కొత్త పేరు

సారాంశం

 ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని కామెంట్లు చేసినా..   ట్రోల్ చేసినా బండ్ల గణేష్ పట్టించుకోరు... వెనక్కి తగ్గరు. అలాగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌పై భక్తి చూపించిన ప్రతిసారీ కూడా బండ్లను ట్రెండింగ్‌లో ఉంచుతుంటారు,

పవన్ భక్తుడు గా బండ్లగణేష్ కు చాలా పేరుంది. తనకు అవకాసం  వచ్చిన ప్రతిసారి తన భక్తిని చూపిస్తూనే ఉంటారు బండ్ల గణేష్. దాన్ని అభిమానం అని కొందరంటే భజన అని ఎగతాళి చేసేవాళ్లు ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని కామెంట్లు చేసినా..   ట్రోల్ చేసినా బండ్ల గణేష్ పట్టించుకోరు... వెనక్కి తగ్గరు. అలాగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌పై భక్తి చూపించిన ప్రతిసారీ కూడా బండ్లను ట్రెండింగ్‌లో ఉంచుతుంటారు, అండగా నిలుస్తుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

 తాజాగా పవన్ పై మరోసారి తన భక్తిలాంటి అభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేష్.బండ్ల గణేష్‌ కొత్తగా పవన్‌ కు ‘దేవర’ అనే పేరును పెట్టుకున్నాడట. పరమ శివుడును దేవర అని పిలుస్తూ ఉంటారు. అందుకే తాను పవన్‌ కళ్యాణ్ ను ఇకపై దేవర అని పిలుచుకుంటాను అంటూ బండ్ల గణేష్‌ చెప్పుకొచ్చాడు.  

 త‌న అభిమాన హీరో పేరును మారుస్తూ ట్వీట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా గ‌ర్బ‌ర్ సింగ్ స‌మ‌యంలో ప‌వ‌న్‌తో దిగిన ఫొటోను షేర్ చేసిన బండ్ల గ‌ణేశ్‌.. `నా దేవర తో నేను భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను` అంటూ రాసుకొచ్చాడు. బండ్ల గ‌ణేశ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ ట్వీట్‌ను ఇప్పుడు తెగ వైర‌ల్ చేస్తున్నారు. 

 రీసెంట్ గా బండ్ల గణేష్ వేరే వారి ట్విట్ రీట్వీట్ చేస్తే అదీ వైరల్ అయ్యింది. ‘పవర్ లేకపోతే భారతదేశం ఎలా ఉంటుందో.. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు సినిమా కూడా అలానే ఉంటుంది’ అనే కొటేషన్‌తో బండ్ల గణేష్ మాదిరిగానే ఉన్న మరో పవన్ భక్తుడు ఓ వీడియోను షేర్ చేశాడు. అయితే ఈ వీడియో బండ్ల గణేష్ రీట్వీట్ చేసి తన అభిమానాన్ని మరోసారి చూపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?