మారుమూల ఉన్నవారిని సెలబ్రిటీలను చేసింది జబర్దస్త్ .అలాంటి వారిలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు.సిల్వర్ స్క్రీన్ పై స్పేస్ పెంచుకుంటూ వస్తోన్న ఇమ్మాన్యూయల్ కు సంబందించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఎక్కడో మారుమూల ఉన్నవారిని సెలబ్రిటీలను చేసింది.అలాంటి వారిలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. వర్షతో కలిసి ఇమ్మాన్యూయేల్ చేసే సందడి అంతా ఇంతా కాదు. రకరకాల స్కిట్లు.. తన మార్క్ డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు ఇమ్మాన్యూయల్.జబర్థస్త్ లో చాలా తక్కువ టైమ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఇమ్మాన్యూయల్.. బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అటు సినిమా అవకాశాలు కూడా సాధించాడు.
వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై స్పేస్ పెంచుకుంటూ వస్తోన్న ఇమ్మాన్యూయల్ కు సంబందించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇమ్మాన్యుయేల్ చనిపోయారు అంటూ.. ఓ య్యూట్యూబ్ థంబ్ నెయిల్ వైరల్ అయ్యింది. అంతే కాదు పక్కన వర్ష ఏడుస్తూ కూర్చున్న ఫోటో కూడా పెట్టారు. దాంతో ఈ వార్తను పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దాంతో అందరిలో కన్ఫ్యజన్ మొదలయ్యింది. స్కిట్ లలో కనిపిస్తున్న ఇమ్మాన్యూయల్ సడెన్ గా చనిపోవడం ఏంటీ అంటూ.. అభిమానులు కంగారు వ్యక్తం చేశారు.
ఇక ఈ వార్తలపై తాజాగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి ప్రచారం చేసేవారిని ఏమనాలో అర్దం కావడంలేదంటున్నాడు. తాను చనిపోలేదని బ్రతికే ఉన్నానని.. అయితే ప్రేమ వాలంటీర్ అనే సిరీస్ లో క్లైమాక్స్ లో తను చనిపోయినట్టు చూపించారట. దాంతో సిరీస్ లో చనిపోయినట్టు నటిస్తే నిజంగానే నన్ను చంపేశారు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్ము.
మనిషి బ్రతికి ఉండగానే చనిపోయాడంటూ ఎలా ప్రచారం చేస్తారు.. ఇలా చేస్తే వారు ఎంత బాధపడుతారు..వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది కదా..మరి ఫ్యామిలీలో ఎంత కంగారు పడతారు.. మీ ఇంట్లోనే ఇలాంటిది జరిగితే మీకు ఎలా ఉంటుంది.. వ్యూస్ కోసం..రేటింగ్స్ కోసం ఇలాంటి అర్థంలేని వార్తలను ప్రచారం చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ.. వారిపై గట్టిగా స్పందించారు ఇమ్మాన్యూయల్.
ఇది ఇప్పుడు జరిగింది మాత్రమే కాదు.. చాలా మంది స్టార్ సెలబ్రిటీలపై కూడా ఇలానే వార్తలు వండి వార్చుతున్నారు కొన్ని సైట్స్.. వరకు ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలను కూడా చనిపోయినట్టు వార్తలు ప్రచారం చేయగా చివరికి వారికి కూడా మేము బ్రతికే ఉన్నామని మా గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.