రెడ్‌ వైన్‌ ఒక్కటే తాగుతా.. యాంకర్‌ అనసూయ

Published : Jun 20, 2020, 04:04 PM IST
రెడ్‌ వైన్‌ ఒక్కటే తాగుతా.. యాంకర్‌ అనసూయ

సారాంశం

యాంకర్ అనసూయ తన గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటో బయట పెట్టింది. `నేను రోజు గ్లాస్‌ రెడ్‌ వైన్‌.. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ తింటాను. అవే నా గ్లామర్‌ సీక్రెట్‌ అని నేను అనుకుంటున్నాను` అంటూ రివీల్ చేసింది అనసూయ. అంతేకాదు నేను వైన్‌ తప్ప ఇంకేమీ తీసుకోను అని చెప్పింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌ అనసూయ ఎప్పటికప్పుడు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బోల్డ్ కామెంట్స్‌ చేస్తుంటుంది. అదే సమయంలో తన మీద వచ్చే ట్రోలింగ్స్ విషయంలోనూ అదే స్థాయిలో స్పందిస్తుంటుంది అనసూయ. సోషల్ మీడియాలో ఫుల్‌ ఫాంలో ఉండే ఈ బ్యూటీ గ్లామర్‌కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జబర్థస్త్‌ వేదిక మీద అందాలు ఆరబోసి పాపులర్‌ అయిన ఈ బ్యూటీ సినిమాల్లోనూ సత్తా చాటింది.

తాజాగా ఈ బ్యూటీ తన గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటో బయట పెట్టింది. `నేను రోజు గ్లాస్‌ రెడ్‌ వైన్‌.. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ తింటాను. అవే నా గ్లామర్‌ సీక్రెట్‌ అని నేను అనుకుంటున్నాను` అంటూ రివీల్ చేసింది అనసూయ. అంతేకాదు నేను వైన్‌ తప్ప ఇంకేమీ తీసుకోను అని చెప్పింది అనసూయ. గ్లామర్ సీక్రెట్‌ కాబట్టి వైన్‌ ఒక్కటే అలవాటు అన్న అనసూయ, అది గుండెకు కూడా చాలా మంచిది అని చెప్పింది.

వైన్‌ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి రాత్రి గ్లాసు రెడ్‌ వైన్‌ తాగుతాను అని చెప్పింది. ఉపవాసాలు ఉంటారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా అవంటే నాకు అస్సలు గిట్టదు. అందుకే ఫుల్‌ మీల్స్‌కు బదులుగా గ్లాస్‌ రెడ్‌ వైన్‌ డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటానని చెప్పింది ఈ హాట్ యాంకర్. ప్రస్తుతం టీవీ షోస్‌తో పాటు సినిమాలతోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కృష్ణవంశీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?