తెలుగులో గ్యాప్‌పై స్పందించిన జేడీ చక్రవర్తి.. విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయని చెబితే..

Published : Aug 02, 2023, 06:56 PM IST
తెలుగులో గ్యాప్‌పై స్పందించిన జేడీ చక్రవర్తి.. విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయని చెబితే..

సారాంశం

 జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. తెలుగులో గ్యాప్‌పై ఆయన స్పందించారు. టాలీవుడ్‌ సొంతిళ్లు అయితే, బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిదని, అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చానని తెలిపారు. 

`సత్య`, `మనీ`, `మనీ మనీ`, `గులాబీ`, `బొంబాయి ప్రియుడు` వంటి సినిమాలతో తన మార్క్ ని చాటుకున్నారు జేడీ చక్రవర్తి. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా, కీలక పాత్రలతో మెప్పించాడు. ఇటీవల సినిమాలు తగ్గించారు. తెలుగులో ఆయన `నక్షత్రం`, `హిప్పి` చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిశారు. కానీ ఆయన పూర్తి స్థాయి తెలుగు సినిమా చేసి చాలా రోజులే అవుతుంది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు `దయా` అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇది ఈ నెల 4న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. తెలుగులో గ్యాప్‌పై ఆయన స్పందించారు. టాలీవుడ్‌ సొంతిళ్లు అయితే, బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిదని, అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చానని తెలిపారు. అయితే తన బలం మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అని, అందుకే మళ్లీ  ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నానని వెల్లడించారు. ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై ఉంటుందని, ఇక్కడ ఫామ్‌లో ఉన్నవారికే అవకాశాలుంటాయన్నారు. ఇప్పుడు నా కోసం విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయని తాను చెబితే అబద్దమవుతుందని, కొన్ని క్యారెక్టర్స్ నచ్చక వదిలేస్తున్నట్టు తెలిపారు. బాలీవుడ్‌ వెళ్లడం వల్ల తెలుగులో ఆఫర్లు తగ్గాయని, దీనికితోడు తాను సెలక్టీవ్‌గా ఉండటం వల్ల ఇక్కడ గ్యాప్‌ వస్తుందన్నారు జేడీ చక్రవర్తి. 

జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. దీనికి గురించి జే డీ చక్రవర్తి చెబుతూ, కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. `దయా` అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. 

హాట్ స్టార్ నుంచి దయా వెబ్ సిరీస్ కోసం నన్ను తరుచూ సంప్రదించారు. నేను సిరీస్  చేసే మూడ్ లో లేక డెసిషన్ చెప్పడం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా. వాళ్లు మాత్రం వదలలేదు.  డైరెక్టర్ పవన్ సాధినేని ఫోన్ లో పది నిమిషాలు కథ వినిపించాడు. దీంతో వెంటనే పూర్తి స్టోరీ వినకుండానే `దయా` వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్పా. ఎందుకంటే నాకు గతంలో ఆర్జీవీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను.

దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. 

దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ  ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. 

ఓటీటీలో స్టార్  డమ్ ను  కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడైనా దయాలో చూస్తారు` అని వెల్లడించారు జేడీ చక్రవర్తి.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి