చిరంజీవి 40 ఏళ్ల అనుభవం ఏమైంది? 

By Sambi ReddyFirst Published Sep 1, 2022, 12:22 PM IST
Highlights


చిరంజీవి కొరటాలను సాధించడం వదల్లేదు. వీలు దొరికినప్పుడల్లా ఆయనపై సెటైర్స్ వేస్తున్నారు. కొరటాల వల్ల నష్టపోయానన్నట్లు మాట్లాడుతున్నారు. కొరటాలను చిరంజీవి ఇంత సీరియస్ గా టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


40 ఏళ్ల సుదీర్ఘ అనుభవంలో చిరంజీవి అనేక హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ చూశారు. అదే సమయంలో ప్లాప్స్ , అట్టర్ ప్లాప్స్, డిజాస్టర్స్ కూడా చూశారు. పేరు మోసిన దర్శకదిగ్గజాలు కూడా ఆయనకు డిజాస్టర్స్ ఇచ్చారు. ఒక సినిమా విజయాన్ని అనేక విషయాలు నిర్ణయిస్తాయి. మూవీ కంటెంట్ ప్రధానం అయినప్పటికీ, ప్రేక్షకుల మూడ్, అప్పటి ట్రెండ్, విడుదలైన సీజన్, సోషల్ మీడియా ఫాక్టర్స్ ఇలా చాలా విషయాలు కలిసి రావాలి. జాతిరత్నాలు థియేటర్స్ లో కాసులు కురిపించింది. అదే సినిమా ఓటీటీలో నిరాశపరిచింది. ఓ వర్గం ఆడియన్స్ జాతిరత్నాలు చెత్త సినిమా అంటూ తేల్చేశారు. 

అంతెందుకు మహేష్ అతడు మూవీ థియేటర్స్ లో యావరేజ్ బుల్లితెరపై బ్లాక్ బస్టర్. దర్శకుడు సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనడంలో సందేహం లేదు. అయితే ఒక్కోసారి శక్తివంచన లేకుండా పని చేసినా ఫలితం రాకపోవచ్చు. మనం అనుకున్న కాన్సెప్ట్ చిత్రీకరణలో ఉండగా అదే స్టోరీ లైన్ తో మరో మూవీ వస్తే అయోమయ పరిస్థితి ఏర్పడవచ్చు. నటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక నిపుణుల పనితనం ఇలా చాలా విషయాలు సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయి. 

ఆచార్య ఫెయిల్యూర్ పైన చెప్పిన కొన్ని ఫాక్టర్స్ కారణం అయ్యాయి. నేరం మొత్తం చిరంజీవి కొరటాల మీదకు నెట్టేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా కొరటాల శివ హర్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి పనిలో పనిగా డైరెక్టర్స్ పై సంచలన కామెంట్స్ చేశారు . దర్శకులు రిలీజ్ డేట్ పై కంటే కంటెంట్ పై ఫోకస్ పెట్టాలి. లేదంటే అందరు నష్టపోతారు. సినిమా విజయంలో డైరెక్టర్ కీలక పాత్ర. సినిమా బాగోపోతే రెండో రోజే వెళ్ళిపోతుంది. నేను కూడా ఆ బాధితుల్లో ఒకడిని అంటూ కొరటాలను ఉద్దేశిస్తూ సెటైర్స్ వేశారు. లాల్ సింగ్ చడ్డా ప్రొమోషన్స్ లో కూడా చిరంజీవి డైరెక్టర్ కొరటాలను టార్గెట్ చేశారు. సినిమా అన్నాక జయాపజయాలు సహజం. ఇంత అనుభవం ఉన్న చిరంజీవి ఓ దర్శకుడిని ఇలా సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!