బాలీవుడ్‌లోకి `ఇస్మార్ట్ శంకర్`‌.. హీరో ఎవరంటే?

Published : Oct 05, 2020, 07:39 AM ISTUpdated : Oct 05, 2020, 08:07 AM IST
బాలీవుడ్‌లోకి `ఇస్మార్ట్ శంకర్`‌.. హీరో ఎవరంటే?

సారాంశం

తాజాగా `ఇస్మార్ట్ శంకర్‌` హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని భావిస్తుంది. అయితే ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటింపచేయాలని భావిస్తున్నారు.

`ఇస్మార్ట్ శంకర్‌` తెలుగులో దుమ్ముదులిపిన చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎన్నో రోజులుగా హిట్లు లేక ఇబ్బంది పడుతున్న రామ్‌కి అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ని అందించింది. అంతేకాదు ఈ సినిమాతో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ పూర్వవైభవం సంపాధించాడు. మరోవైపు నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు. 

తాజాగా ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని భావిస్తుంది. అయితే ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటింపచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో కథా చర్చలు జరుగుతున్నాయని టాక్‌. రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమాలో హీరోగా చేస్తే దాని రేంజే వేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

మరి దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం మేరకు పూరీ జగన్నాథే దీనికి డైరెక్షన్‌ వహించే ఛాన్స్ ఉందని టాక్‌. ప్రస్తుతం పూరీ తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా సినిమాగా `ఫైటర్‌`ని రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?