పవన్‌‌కు జెడ్ కేటగిరీ భద్రత....నిజం ఇదీ

Surya Prakash   | Asianet News
Published : Oct 05, 2020, 07:12 AM IST
పవన్‌‌కు జెడ్ కేటగిరీ భద్రత....నిజం ఇదీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాల్లో ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోం శాఖ ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని జనసేన కార్యాలయం కొట్టిపారేసింది.

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించిందని ఆదివారం సాయంత్రం రూమర్స్  వచ్చాయి.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాల్లో ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోం శాఖ ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని జనసేన కార్యాలయం కొట్టిపారేసింది.

‘‘పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారనే ప్రచారంలో నిజం లేదు. జెడ్ కేటగిరీ భద్రతపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. మేము కూడా పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరలేదు. కొంత మంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని జనసేన కార్యాలయం పేర్కొంది. మరో ప్రక్క పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించందనే వార్త సోషల్ మీడియాలో వైరల్  కావడంతో కొంత మంది బీజేపీని టార్గెట్ చేశారు. 

ఇక జెడ్ కేటగిరి సెక్యూరిటీని నక్సలైట్స్ లేదా టెర్రరిస్ట్ ల నుంచి థ్రెట్ ఎదుర్కొంటున్న  టాప్ లీగ్ పొలిటీషన్స్ లేదా లీడర్స్ కు ఇస్తారు. పవన్ కళ్యాణ్ కు అలాంటి సమస్యలు ఏమీ లేవు.  తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ కోరితే ఆయన కూడా జెడ్ కేటగిరీ భద్రతను కల్పించే అవకాశం ఉంటుంది.

ఈ మధ్యనే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు, నటుడు-ఎంపీ రవికిషన్‌కు వై కేటగిరీ భద్రతను కల్పించారు.  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంట్లో ఇదా్దరు పిల్లలు,భార్యతో ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం చతుర్మాస దీక్షలో ఉన్నారు. త్వరలోనే వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం