
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. జైలర్ ట్రైలర్ ఆకట్టుకుంది. రజినీకాంత్ పాత్రలో షేడ్స్, వేరియేషన్స్ బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉన్నాయి. ట్రైలర్ తో జైలర్ కథపై ఒక అవహగాన వచ్చింది. ఉద్యోగం నుండి రిటైర్ అయిన సీనియర్ సిటిజన్ గా రజనీకాంత్ రోల్ ఉంది. ఆయన భార్య పాత్ర రమ్యకృష్ణ చేశారు. పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు రజినీకాంత్ పాత్రకు ఉన్నారు.
కాబట్టి రజినీకాంత్ ఇతర చిత్రాల్లో మాదిరి యంగ్ బ్యూటీని ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం వంటి సన్నివేశాలు జైలర్ లో ఉండవు. ఆయన వయసుకు తగ్గ రోల్ చేశారు. ఈ క్రమంలో తమన్నా పాత్ర ఏంటనే ఆసక్తి కలుగుతుంది. ట్రైలర్ లో తమన్నాను కనీసం చూపించలేదు. ఇవన్నీ గమనిస్తుంటే తమన్నాది జస్ట్ గెస్ట్ రోల్ అయ్యే అవకాశం ఉంది. కావాలయ్యా సాంగ్ తో పాటు ఒకటి రెండు సన్నివేశాలకు ఆమెను పరిమితం చేసి ఉండవచ్చు. కాబట్టి తమన్నా జైలర్ మూవీలో జస్ట్ కరివేపాకు రోల్ చేశారంటూ పుకార్లు మొదలయ్యాయి.
చెప్పాలంటే భోళా శంకర్ లో కూడా తమన్నా పాత్ర పాటలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కలవు. కారణంగా... ఇది సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ డ్రామా. కీర్తి సురేష్ కీలకమైన చెల్లి పాత్ర చేస్తుంది. కాబట్టి భోళా శంకర్ లో కూడా ఆమెకు అంత ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. జైలర్, భోళా శంకర్ ఒకరోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో తమన్నా నటించారు. స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయిన తమన్నా వచ్చిన రోల్ కాదనకుండా చేసుకుంటూ పోతుంది.
ఫేడ్ అవుట్ దశ సమీపిస్తుండగా నాలుగు రాళ్లు వెనకేసుకునే ఆలోచనలో ఉంది. అందుకేనేమో బోల్డ్ సన్నివేశాలకు వెనుకాడకుండా వెబ్ సిరీస్లు చేస్తుంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 సిరీస్లలో తమన్నా తెగించి నటించారు. అదేమని అడిగితే... ఈ రోజుల్లో కూడా శృంగార సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారా? పాత్ర డిమాండ్ చేస్తే చేయకతప్పదని తెగేసి చెప్పింది.