విషాదం.. రోడ్డు పక్కన సీనియర్ నటుడి మృతదేహం.. కమల్ హాసన్ తో నటించిన యాక్టర్ కి ఈ దుస్థితి..

By Asianet News  |  First Published Aug 3, 2023, 3:15 PM IST

కోలీవుడ్ విషాద ఘటన జరిగింది. లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి నటించిన సీనియర్ నటుడు ధీనస్థితిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహం రొడ్డు పక్కన లభించడం బాధాకరం..
 


కోలీవుడ్ లో విషాదం జరిగింది. తమిళ సీనియర్ నటుడు ధీనస్థితిలో మృతిచెందారు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)తో కలిసి ‘విచిత్ర సోదరులు’ అనే చిత్రంలో నటించిన మోహన్ (55)  అనుమానాస్పందంగా మృతిచెందారు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం పెరియ రథం  వీది సమీపంలో ఉన్న వెళ్లింగిండ్రు వద్ద Mohan మృతదేహం కనిపించింది. 

మంగళవారం స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం డెడ్ బాడీని ముధరై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అనంతరం ఆ మృతదేహం సీనియర్ నటుడు మోహన్ దిగా గుర్తించారు. సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన మోహన్ చాలా సినిమాల్లోనే నటించారు. ‘విచిత్ర సోదరులు’తో పాటు ‘నాన్ కడవుల్’, ‘అదిశయ మనిదర్ గల్’ వంటి చిత్రాల్లో కనిపించారు. 

Latest Videos

అయితే, మరీ రోడ్డు పక్కన శవమై తేలడం పట్ల సినీలోకం చింతిస్తోంది. ఆయనకు ఇలాంటి ధీనస్థితి రావడానికి కారణం ఏంటని చూస్తున్నారు. ఇంతకీ మధురైకి ఎందుకు వెళ్లారు? అనుమానాస్పద స్థితిలోని ఆయన మృతికి కారణం ఏంటనే? కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలో మిగిలిన విషయాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి మోహన్ కుటంబానికి సమాచారం అందించారు. 

కాగా, మోహన్ కొద్దికాలంగా సినిమా అవకాశాలు లేక బాగా ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. ఏ చిన్న పాత్ర కూడా దొరకపోవడంతో ఆర్థికంగా, కనీసం తిండి తినలేని స్థితికి చేరుకున్నారంట. అలాంటి దుస్థితిలో ఏంట చేయాలో తెలియక కొన్నాళ్ల నుంచి భిక్షాటన కూడా చేశారని అంటున్నారు. పేదరికం, అనారోగ్యం కారణం వల్లే చనిపోయారని అంటున్నారు. 

click me!